ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి.. వంద రోగాలను మాయం చేస్తుంది..!
Parwal (budmakaya) Benefits In telugu : మన ఇంటి చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు కనపడతాయి. కానీ వాటి గురించి మనకు తెలియక పిచ్చి మొక్కలుగా భావిస్తాం. బుడమకాయను పూర్వ కాలంలో ఎక్కువగా వాడేవారు. బుడమకాయతో పప్పు,ఆవకాయ,కూర,పచ్చడిగా చేసుకోవచ్చు.ఇది కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. బుడమకాయలలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
బుడమకాయలో విటమిన్ సి, ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఫాస్పరస్, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. అధిక బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అలాగే శరీర కణాల పెరుగుదల మరియు మరమ్మత్తును ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు రకరకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన సన్నని గీతలు, ముడతలు, మచ్చలు మరియు చర్మ వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి మరియు రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. కాలేయం పనితీరును సహాయపడటమే కాకుండా కామెర్లు చికిత్సలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.