సంక్రాంతికి వస్తున్న సినిమాల మీద ఒక లుక్ వేయండి
sankranthi movies : సంక్రాంతి వచ్చిందంటే అభిమానులకు పండగే. తమ అభిమాన నటుల సినిమాలు చూడటానికి సిద్దంగా ఉంటారు. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నాయో చూద్దాం.
అజిత్ హీరోగా డబ్బింగ్ చిత్రం తునివు (thunivu) జనవరి 11న రిలీజ్ కి సిద్దం అవుతుంది. మొదటగా ఈ చిత్రం రిలీజ్ కావడంతో ఈ చిత్రానికి ఫుల్ గా థియేటర్స్ అందుబాటులో ఉండనున్నాయి. నందమూరి నటసింహం బాలయ్య బాబు, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహారెడ్డి (veera simha reddy) సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “వాల్తేరు వీరయ్య” (waltair veerayya). ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ చేస్తున్న సినిమా “వరిసు” తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడు(varasudu) పేరుతో విడుదలచేయనున్నారు. తెలుగులో అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తమిళంలో జనవరి 11 న, తెలుగులో 14 న విడుదల అవుతుంది. అలాగే జనవరి 14 న సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న కళ్యాణం కమనీయం సినిమా (kalyanam kamaneeyam movie) కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. భారీ అంచనాలు మధ్య వస్తున్న ఈ సినిమాలన్నింటిలో ఏ సినిమా నిలబడుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.