ఉసిరితో ఇలా చేస్తే జుట్టు రాలకుండా, చుండ్రు లేకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
Amla Hair Fall Home Remedies In Telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక కారణాలతో చాలా మంది జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్యలు రాగానే చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే నూనెలను వాడుతున్నారు. వాటి ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.
అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలోనే ఒక నూనె తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే నూనె చాలా బాగా పనిచేస్తుంది. ఒక క్లాత్ తీసుకొని దానిలో 2 స్పూన్ల ఎండిన ఉసిరి ముక్కలు, అరస్పూన్ కలోంజి గింజలు, అరస్పూన్ మెంతులను వేసి మూట కట్టాలి. ఒక సీసాలో 100 ml ఆవనూనెను పోసి దానిలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న మూటను వేసి మూత పెట్టి 3 రోజుల పాటు ఎండలో ఉంచాలి.
ఈ నూనెను వారంలో 2 సార్లు జుట్టుకి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే క్రమంగా జుట్టు రాలే సమస్య తాగిపోతుంది. ఆవనూనె,మెంతులు,కలోంజి గింజలు, ఉసిరి లలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
ఈ నూనెను దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. ఎండిన ఉసిరి ముక్కలను ఇంటిలో తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతం ఉసిరి కాయలు విరివిగా వస్తున్నాయి. ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి బాగా ఎంబెట్టి నిల్వ చేసుకోవచ్చు. లేదా ఉసిరి ముక్కలు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.
కాబట్టి చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నూనెను తయారుచేసుకొని వాడితే 15 రోజుల్లోనే తేడా కనపడుతుంది. కాబట్టి కాస్త శ్రద్ద చేసుకొని ఈ నూనెను వాడటానికి ప్రయత్నం చేయండి. ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఆవనూనెను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.