ఈ పండును ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ఎన్నో ప్రయోజనాలు… అసలు నమ్మలేరు
Apple ber benefits In Telugu: ఈ సీజన్ లో Apple ber చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. ఈ పండులో ఖనిజాలు, విటమిన్లు,ఫ్లేవనాయిడ్స్, పాలీశాకరైడ్లు మరియు ట్రైటెర్పెనిక్ యాసిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఈ పండు శరీరం నుండి హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపటమే కాకుండా గుండెకు సంబందించిన సమస్యలు, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది.
విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఫలితంగా ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. దీనిలో ఉండే పొటాషియం కండరాల పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్‌ను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ ఫ్రూట్ మీ శరీరం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన 24 ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో 18 ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.
ఈ పండ్లలో సహజ చక్కెరలు ఉండుట వలన తక్షణ శక్తిని అందిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండు ఒక మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పండులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒక పండు తింటే ఒత్తిడి లేకుండా మంచి నిద్ర పడుతుంది.
ఈ పండులో పైబర్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి అల్సర్లు మరియు అనేక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పొటాషియం, మాంగనీస్, భాస్వరం, ఇనుము మరియు జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉండుట వలన… హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది మరియు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని ముఖ్యమైన అవయవాలకు రవాణా చేయడం ద్వారా మంచి రక్త ప్రవాహాన్ని నిర్వహిస్తుంది.
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండటమే కాకుండా ఆకలిని నియంత్రణలో ఉంచి అధిక బరువును తగ్గించటానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.