Healthhealth tips in teluguKitchen

ఈ ఆకు గురించి ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు… ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు…

Bitter gourd leaves Health benefits In Telugu : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం అనేది డయాబెటిస్ నియంత్రణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాకరకాయ గురించి తెలియని వారు ఉండరు. కాకరకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. డయాబెటిస్ చికిత్సలో బాగా సహాయపడుతుంది.

కాకర ఆకులను కూడా తినవచ్చు. కొన్ని దేశాలలో ఈ ఆకులను ఫ్లేవర్ ఏజెంట్లుగా ఉపయోగిస్తారు. కాకర ఆకు కూడా కొంచెం చేదుగా ఉంటుంది. కాకర కాయ రుచిలో ఎలా ఉంటుందో కాకర ఆకు కూడా అలాగే ఉంటుంది. అయితే కాకర కాయలో కన్నా కాకర ఆకులో ఎక్కువ శక్తివంతమైన పోషకాలు ఉన్నాయి.
Bitter gourd leaves
కాకర ఆకులతో టీ తయారుచేస్తారు. కాకర ఆకులో అనేక బయోయాక్టివ్ లక్షణాలు ఉంటాయి. ప్రాచీన కాలం నుండి కాకర ఆకును వైద్యంలో వాడుతున్నారు. కాకర ఆకులలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. డయాబెటిస్ నివారణలో కాకర ఆకులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
Diabetes diet in telugu
ఒక గ్లాస్ నీటిలో 3 కాకర ఆకులను వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి పావు కప్పు చొప్పున రోజులో మూడు సార్లు త్రాగాలి. డయాబెటిస్ నిర్వహణలో ఈ ఆకు కాషాయం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఈ కషాయం తాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. కాబట్టి కాకరకాయ ఆకు కషాయం తాగి ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.