వారంలో 2 సార్లు తింటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు… అసలు నమ్మలేరు
cabbage Benefits In Telugu :క్యాబేజీ ఏడాది పొడవునా లభ్యమవుతుంది. మనం ప్రతి రోజు కూరలు చేసుకొని తింటూ ఉంటాం. వాటిల్లో క్యాబేజీ అంటే కొంతమంది తినరు. క్యాబేజీ వాసన కారణంగా తినటానికి ఆసక్తి చూపరు. అయితే ఇప్పుడు చెప్పే ఉపయోగాలు,ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే క్యాబేజీ ని తినటం అలవాటు చేసుకుంటారు.
క్యాబేజి బ్రాసికా కుటుంబానికి చెందినది. క్యాబేజిలో రెడ్ క్యాబేజి మరియు గ్రీన్ క్యాబేజి అనే రెండు రకాలు ఉన్నాయి. మనం ఎక్కువగా గ్రీన్ క్యాబేజిని వాడుతూ ఉంటాం. రెడ్ క్యాబేజీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది.క్యాబేజిని కూరగాను,సలాడ్స్ లలో ఉపయోగిస్తాం. గ్రీన్ క్యాబేజీలో క్రోమియం సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
అంతేకాక శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. క్యాబేజీలో విటమిన్స్ , ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల క్యాబేజ్ ను అందరూ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎన్నో పోషకాలు ఉన్న క్యాబేజీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. క్యాబేజీలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాక కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది.
క్యాబేజిలో ఎమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన మంటను తగ్గించటంలో సహాయపడుతుంది. క్యాబేజిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తి ని పెంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతం చేయటంలో సహాయపడి ఫ్రీరాడికల్స్ ను నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ మధ్య చేసిన పరిశోధనల్లో క్యాబేజీలో అల్జీమర్స్ ని నిరోధించే లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు.
అయితే ఈ లక్షణాలు రెడ్ క్యాబేజీలో మాత్రమే ఉన్నాయి. అల్జీమర్స్ సమస్యను నివారించే విటమిన్ K రెడ్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంటుంది. క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల కడుపులో మంట,కడుపులో పూతలు తగ్గుతాయి. అందువల్ల కడుపు మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం త్రాగితే ప్రయోజనం ఉంటుంది.
క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాబేజీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఎంత క్యాబేజీ సూప్ అయినా త్రాగవచ్చు. బరువు పెరుగుతామనే భయం అవసరం లేదు. క్యాబేజీలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియ బాగా జరిగి మలబద్దకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించి వృద్దాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులు రోజు క్యాబేజీని తింటూ ఉంటే పాలు బాగా పడతాయి. క్యాబేజ్ లో సమృద్ధిగా ఉండే ల్యాక్టిక్ ఆమ్లం గొంతు నొప్పి నుంచి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది.
క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు తొందరగా తగ్గిపోతుంది. క్యాబేజి రసం త్రాగలేని వారు కొంచెం పంచదార వేసుకోవచ్చు. అయితే పంచదార వేసుకోకుండా త్రాగితేనే మంచిది. కాబట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు Cabbage ని తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.