MoviesTollywood news in telugu

Srikanth పెళ్లి సందడి సినిమా గురించి నమ్మలేని కొన్ని నిజాలు…అసలు నమ్మలేరు

Srikanth Pelli sandadi Full Movie :దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో శ్రీకాంత్ హీరోగా 1996లో వచ్చిన పెళ్ళిసందడి మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. తాజ్ మహల్ తో హీరోగా మారి, చిన్నచిన్న వేషాలతో నెట్టుకొస్తున్న శ్రీకాంత్ ని స్టార్ హీరోగా మార్చేసిన ఈ మూవీ 15కోట్లకు పైగా వసూలు చేసి, లాభాల పంట పండించింది.

ఈ సినిమాలో విజయ యాత్రలు మళ్ళీ స్టార్టు అయ్యాయి. షోలే,అం అప్ కె హైన్ కమ్ మూవీస్ బాలీవుడ్ లో ట్రెండ్ సృష్టిస్తే, వాటినే ఆదర్శంగా తీసుకుని దర్శకేంద్రుడు అడవి రాముడు, పెళ్లి సందడి చేయడం విశేషం. కీరవాణి మ్యూజిక్ అదిరిపోయింది. విపరీతంగా కేసెట్లు అమ్ముడయిపోయాయి. క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని సాంగ్స్ కి అందరూ పరవశించి పోయారు.

మిగిలిన భాషల్లో కూడా దీన్ని రీమేక్ చేసారు. అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నా, జ్యోతి లాంటి చిన్న సినిమా చేయాలని అనుకున్న దర్శకేంద్రుడు వెంటనే ఆలోచనలకు పదును పెట్టారు. అందుకు అనుగుణంగా సత్యానంద్ కథ అల్లేశారు. ఒక అమ్మాయి ఇతడిని ప్రేమిస్తుంది. కానీ ఇతనికి ఓ స్వప్న సుందరి కనిపిస్తుంది.

తీరా ఆ స్వప్న సుందరి ఎదురవ్వడం, తననే ప్రేమిస్తున్న అమ్మాయికి చెల్లెలు కావడం ఈ చిత్ర కథ. అందమైన ఈ ప్రేమకథ గురించి అల్లు అరవింద్ కి చెప్పారు. డైరెక్ట్ గా రిలీజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో వైజయంతి మూవీస్ అశ్వినీదత్, లక్ష్మి ఫిలిమ్స్ జగదీశ్ ప్రసాద్ లను భాగస్వామ్యులుగా చేసుకుని, శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, శ్రీకాంత్ ని హీరోగా సెలక్ట్ చేసారు.

దీప్తి భట్నాగర్, రవళి లను హీరోయిన్స్ గా సెలెక్ట్. 1995ఆగస్టు 20న షూటింగ్ రామానాయుడు స్టూడియోలో స్టార్ట్ చేసారు. రవళి, శ్రీకాంత్ ల తలంబ్రాలు దృశ్యాన్ని ముహూర్తపు షాట్ గా తీశారు. నాగార్జున పూజా కార్యక్రమాలు , అజయ్ దేవగన్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. బాలీవుడ్ హీరో క్లాప్ కొట్టారు. బాలీవుడ్ డైరెక్టర్ ఇంద్రకుమార్ గౌరవ దర్శకత్వం వచించగా, జూహ్లీ చావ్లా చీఫ్ గెస్ట్.

ఇందులోని 9సాంగ్స్ లో వేటూరి మూడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి2, జొన్నవిత్తుల ఒకటి, సామవేదం షణ్ముఖ శర్మ 2, చంద్రబోస్ 2సాంగ్స్ రాసారు. గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ షూటింగ్ చేసారు. అరకు, బెంగుళూరు, శివసముద్రం లలో సాంగ్స్ షూట్ చేసారు. 86లక్షలతో పూర్తయిన ఈ మూవీ 1996జనవరి 11న రిలీజ్. సినిమా జనానికి నచ్చేసింది.

సాంగ్స్ కి దర్శకేంద్రుడే స్వయంగా స్టెప్స్ వేయించడంతో నంది అవార్డు కూడా దక్కించుకున్నారు. చిన్న కథతో స్టార్స్ లేకుండా తక్కువ బడ్జెట్ లో పాత్రలన్నింటికీ పనికల్పిస్తూ తీసిన ఈ మూవీ నిజంగా ఓ సెన్షేషన్. శ్రీకాంత్ కెరీర్ ని మలుపు తిప్పి, చంద్రబోస్ కి మంచి పేరుతెచ్చింది. సత్యానంద్ మాటలు సూపర్భ్. 27కేంద్రాల్లో డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ. సెకండ్ రిలీజ్ లో కూడా 25సెంటర్స్ లో 100డేస్. విజయవాడలో రోజూ 4ఆటలతో 301రోజులు ఆడి, ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది