జెంటెల్ మెన్, మహానటి సినిమాలను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో చూడండి
Telugu actress nithya menon :తమ అభిమాన హీరోయిన్ గురించి విషయాలను తెలుసుకోవటానికి మనలో చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. కొందరు అనుకోకుండా స్టార్ అయిపోతారు. కొందరికి ఛాన్స్ వచ్చినా అందిపుచ్చుకోలేరు. సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం కదా. ఇక మహానటి, జెంటిల్ మేన్ వంటి క్లాసిక్ సూపర్ హిట్ మూవీస్ లో నటించే ఛాన్స్ వచ్చినా స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుంది.
ఆమె ఎవరంటే, తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న నిత్యామీనన్. సావిత్రి బయోపిక్ మహానటి లో ముందుగా నిత్యాను అనుకున్నారట. అయితే ఆమె ఆ పాత్రకు న్యాయం చేయలేనని కాదనుకుందట. అలాగే జెంటిల్ మ్యాన్ మూవీని కూడా రిజెక్ట్ చేసింది.
నిజానికి మహానటి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఆ పాత్రలో జీవించిన కీర్తి సురేష్ కి ఎక్కడలేని గుర్తింపు వచ్చేసింది. నిత్యా ఈ పాత్ర వేసి ఉంటె ఆమె రేంజ్ ఎలా ఉండేదో ఊహించవచ్చు. అందుకే నిత్యాకు అనుకున్న స్థాయిలో క్లిక్ అవ్వలేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నా, రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి.