MoviesTollywood news in telugu

Tollywood హీరోని గుర్తు పట్టారా …ఇప్పుడు,ఎక్కడ ఏమి చేస్తున్నాడో తెలుసా?

Tollywood Hero Abbas :టాలీవుడ్ లో ప్రేమదేశం, రాజా సినిమాల్లో అద్భుత నటన కనబరిచి తెలుగు ఆడియన్స్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్న హీరో అబ్బాస్ చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. 1996లో సూపర్ హిట్ మూవీగా ప్రేమదేశం నిలవడంతో ఇతడి పేరు మారుమోగింది.

యూత్ ని విశేషంగా అలరించిన ప్రేమదేశం మూవీ ఇప్పటికే సెన్షేషన్ మూవీగానే ఉంది. ప్రేమికులకే కాదు, మాములు జనానికి కూడా ఈ సినిమా బాగా నచ్చేసింది. ఇక విక్టరీ వెంకటేష్, సౌందర్య కల్సి నటించిన రాజా మూవీలో కూడా అబ్బాస్ మంచి నటనతో మార్కులు కొట్టేసాడు.

ఇక తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన అబ్బాస్ చివరి సినిమా 2014లో అలా జరిగింది ఒకరోజు. ఆతర్వాత నుంచి కన్పించలేదు. అయితే అతడు చేసిన హార్పిక్ యాడ్ ఇప్పటికీ టివిలో జనానికి కనిపిస్తూ ఉంటుంది. 2016లో మలయాళ మూవీ చేసి, నటనకు పూర్తిగా దూరం అయ్యాడు. న్యూజిలాండ్ లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది.