దానిమ్మ,బొప్పాయి కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా…అసలు నమ్మలేరు
Pomegranate And Papaya Health Benefits In telugu : మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషణ అందుతుంది. ఈ రోజుల్లో మారిన జీవన శైలి కారణంగా మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ప్రారంభించాలి. అలాంటి ఆహారాలలో ప్రతి రోజు పండ్లను డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
బొప్పాయి, దానిమ్మ రెండింటిని కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.బొప్పాయి,దానిమ్మ రెండింటిలోనూ ఎన్నో పాషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒక దానిమ్మ పండు తీసుకుని తొక్క తీసి గింజలు విడతీయాలి.
ఒక చిన్న క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో దానిమ్మ గింజలు, క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బొప్పాయి ముక్కలు వేసి…ఆ తర్వాత పావు స్పూన్ పసుపు, ఒక గ్లాసు నీటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. .
వారంలో మూడు సార్లు ఈ విధంగా తీసుకుంటూ ఉంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ జ్యూస్ తాగటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ సీజన్ లో ఆస్తమా ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి కూడా ఈ జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది. .
రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది..గ్యాస్,అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. మొటిమలు, నల్లని మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే .చుండ్రును తగ్గించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ముఖ్యంగా ఈ సీజన్ లో కాపాడుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు .నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ ని వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.