Honey Rose : వీరసింహారెడ్డిలో నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?
Veera Simha Reddy Movie :బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో Honey Rose నటించింది. ఆమె
తెలుగులో ‘ఆలయం’ ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలు చేసిన పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాలో పెద్ద బాలయ్యకు భార్యగా నటిస్తుంది.
ఈ సినిమాలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటలో డ్యాన్స్ తోపాటు మంచి క్యారెక్టర్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన ‘మాన్ స్టర్’ అనే సినిమాలో నటించి మెప్పించింది. కేరళలో పుట్టిన హనీ.. 14 ఏళ్ల వయస్సులోనే సినీ పరిశ్రమకు వచ్చింది.
2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసిన… ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత హనీ రోజ్ తెలుగులో నటిస్తుంది. ఈ సినిమా ఆమెకు ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.