డయాబెటిస్ ఉన్నవారు వాల్ నట్స్ తింటే ఏమి అవుతుందో తెలుసా…?
Walnuts For Diabetes:ఈ చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తీసుకొనే ఆహారం డయాబెటిస్ నిర్వహణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్స్ వాడకం కూడా బాగా పెరిగింది.
అయితే డయాబెటిస్ ఉన్నవారు ఏ డ్రై ఫ్రూట్ తింటే మంచిదో అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఈ రోజు డయాబెటిస్ ఉన్నవారు వాల్ నట్స్ తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. వాల్ నట్స్ ఇన్సులిన్‌కు నిరోధకతను పెంపొందించడానికి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి మరియు డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడతాయి.
వాల్ నట్స్ లో డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ఫైబర్స్ విచ్ఛిన్నం మరియు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది రక్తప్రవాహంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. వాల్ నట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రోజుకి 2 వాల్ నట్స్ ని రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి.
ఏదైనా డ్రై ఫ్రూట్ లోని పోషకాలు వంద శాతం మన శరీరానికి అందాలంటే నానబెట్టి తినాలి. నానబెట్టకుండా తింటే 60 శాతం పోషకాలు మాత్రమే శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గించటానికి కూడా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ చాలా తొందరగా పెరుగుతుంది.
చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా అధిక బరువు సమస్యను తగ్గించటానికి కూడా వాల్ నట్స్ సహాయపడతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు వాల్ నట్స్ లిమిట్ గానే తీసుకోవాలి. అప్పుడే ఆ ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.