Chiranjeevi ని ఇబ్బంది పెట్టిన హీరోయిన్స్ ఉన్నారా…నిజమా…?
Chiranjeevi movie : చిరంజీవి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. ప్రాణం ఖరీదు మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆతర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా నటించి, తర్వాత హీరోగా ఎదిగి, స్వయంకృషితో మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి. ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు పూర్తయింది.
60ఏళ్ళు దాటినప్పటికీ తన నటనతో, స్టెప్స్ తో ఫాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నారు. ఖైదీ మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్న చిరంజీవి సరసన మాధవి హీరోయిన్ గా చేసింది. చాలామంది హీరోయిన్స్ చిరంజీవి సరసన నటించారు. ఆయనతో సమానంగా స్టెప్స్ వేసి, సినిమాల హిట్ కి దోహదపడ్డారు. ప్రాణం ఖరీదులో కూడా మాధవి హీరోయిన్ కావడం విశేషం.
అయితే ఇద్దరి మధ్యా ఎక్కువగా మాటలు ఉండేవి కావని అనేవారు.రాను రాను చిరంజీవితో ఫ్రెండ్లీ గానే మాధవి మెలిగిందని కూడా టాక్.నగ్మా మాత్రం చిరంజీవిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిందని, ముఖ్యంగా కొన్ని సీన్స్ లో డూప్ ని పెట్టి యాక్ట్ చేయించాల్సిన పరిస్థితులు వచ్చాయని టాక్. వీరిద్దరూ కల్సి నటించిన రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు నిరాశపరిచాయి. అయితే ఘరానా మొగుడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. రిక్షావోడు మూవీకి సరిగ్గా సహకరించక పోవడంతో ఆతర్వాత కల్సి నటించలేదని టాక్.