MoviesTollywood news in telugu

Nagarjuna మిస్ అయిన మూడు ఇండస్ట్రీ హిట్స్…కారణాలు ఇవే…?

Nagarjuna Super Hit Movies : నాగార్జున ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు. ప్రతిభ ఉంటె కొత్తవారికి కూడా చాన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తాడు. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి,గడిచిన మూడున్న దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నాగార్జున విభిన్న పాత్రలతో అలరిస్తూ వస్తున్నాడు.

శివ,నిన్నే పెళ్లాడతా వంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే మరో మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నాగార్జున, శ్రేదేవి, సుహాసిని కాంబినేషన్ లో తెరకెక్కిన ఆఖరి పోరాటం మూవీలో విలన్ గా అమ్రిష్ పురి నటించాడు. ఫస్ట్ సోలో హిట్ మూవీగా నిల్చిన ఆఖరిపోరాటం 50రోజులకు అన్ని సెంటర్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసినప్పటికీ వందరోజులు అయ్యేసరికి ఆ హైప్ నిలబెట్టుకోలేక పోయింది.

అప్పటికే చిరంజీవి పసివాడి ప్రాణం 10సెంటర్స్ లో వంద ఆడి, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే ఆఖరిపోరాటం 7సెంటర్స్ లోనే 100రోజులు ఆడడంతో ఇండస్ట్రీ హిట్ మిస్సయింది. 1988లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా నాగ్ కి బ్రేక్ ఇచ్చి, టాప్ టు మూవీగా నిల్చింది. ఇక అటు క్లాస్, ఇటు మాస్ ని అలరించిన హలోబ్రదర్ మూవీ నాగార్జున డ్యూయెల్ రోల్ తో క్లాస్,మాస్ ని ఆకట్టుకుంది.

ఈ మూవీ 50రోజులకు 6కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ప్పటికీ, చిరంజీవి ఎస్పీ పరశురామ్, వెంకటేష్ సూపర్ పోలీస్ కోసం కొన్ని సెంటర్స్, రాజశేఖర్ గ్యాంగ్ మాస్టర్ కోసం కొన్ని సెంటర్స్ తీసెయ్యడంతో 24సెంటర్స్ లోనే 100డేస్ ఆడి, 9కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 1994లో ఘరానా మొగుడు తర్వాత టాప్ మూవీగా నిల్చింది. దీంతో ఇండస్ట్రీ హిట్ మిస్సయింది.

సమరసింహారెడ్డి మూవీ తరువాత దానికి దగ్గర గా కలెక్షన్స్ రాబట్టిన నాగార్జున నువ్వొస్తావనీ మూవీ 62సెంటర్స్ లో 100డేస్, 42సెంటర్స్ లో 125రోజులు ఆడింది. అయితే నాగ్ నటించిన నిన్నే ప్రేమిస్తా కోసం 30సెంటర్స్ లో నువ్వొస్తావనీ తీసేసారు. దాంతో 7సెంటర్స్ లో 175డేస్ ఆడింది. 14కోట్ల షేర్ తో ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకుంది.