MoviesTollywood news in telugu

సొంతం సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా… ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood heroine Nehha Pendse :టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు వస్తూ ఉంటారు. కొంత మంది సినిమాలు చేస్తూ ముందుకు సాగితే మరి కొంత మంది రెండు మూడు సినిమాలతో కనుమరుగు అవుతారు. ఆర్యన్ రాజేశ్, నమిత జంటగా నటించిన సొంతం సినిమాలో Nehha Pendse నటించింది. ఈ సినిమాలో సునీల్‏కు నేహాకు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.

ఆ తర్వాత గోల్ మాల్, వీధి రౌడి అనే సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు. అలాగే హిందీ, మరాఠీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. 1995 నుంచి సీరియల్స్ చేస్తున్న ఈ భామ.. ఇప్పటికీ వాటిలో నటిస్తూనే ఉంది. ప్రస్తుతం ‘బాబీజీ ఘర్ పర్ హై’ అనే సీరియల్ చేస్తోంది. 2020 జనవరి 5న వివాహం చేసుకుంది. పెళ్లి అయ్యాక కూడా సీరియల్స్ లో నటిస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంది.