First మూవీతోనే హిట్ అందుకున్న భామలు…. ఎంత మంది ఉన్నారో ?
Tollywood Herone First Movie : టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన హీరోయిన్లు ఉన్నారు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు .. అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అని కూడా అంటారు .. ఈ రెండు కల్సి వస్తే … తిరుగు ఉండదు. ఇక ఇండస్ట్రీలో తొలిసినిమాతోనే హిట్ కొట్టేస్తే వచ్చే మజా వేరు.
ఇలా చాలా కొద్దిమందికి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే అక్కినేని వారి కోడలు సమంత. ఏం మాయ చేసావే మూవీతో ఎంట్రీ ఇచ్చి, హిట్ అందుకోవడమే కాదు, తనతో కల్సి నటించిన అక్కినేని వారి వారసుడు నాగచైతన్యను పెళ్లి కూడా చేసుకుంది. డిఫరెంట్ పాత్రలతో మెప్పిస్తూ, పెళ్లి తర్వాత కూడా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ సాయిపల్లవి మంచి హిట్ అందుకుంది. తన నటనతో నిజంగా ఫిదా చేసిన ఈ అమ్మడు అచ్చం తెలుగు అమ్మాయిలా దగ్గరైపోయింది. అందునా తెలంగాణ యాసతో తెలంగాణా వాళ్ళకి మరింత దగ్గరైంది. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా తొలిసినిమా తోనే హిట్ కొట్టింది. ఎన్నో సినిమాలతో ఈ అమ్మడు అలరిస్తోంది.
ఇక వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తొలిసినిమాతోనే హిట్ కొట్టేసి,వరుస పెట్టి సినిమాల్లో దూసుకెళ్లింది. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ సరసన నటించిన శాలిని పాండే మంచి హిట్ అందుకుంది. అయితే ఆతర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఛాన్స్ లు పెద్దగా రాలేదు. ఆర్ ఎక్స్ 100మూవీతో పాయల్ రాజ్ ఫుట్ కూడా ఆడియన్స్ లో చెరగని ముద్రవేసింది.