Arjun Reddy సినిమాని మిస్ చేసుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా?
Arjun Reddy Movie : అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండకు ఒక ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి మూవీని తెలుగులో విజయ్ దేవరకొండ చేసాడు. సందీప్ వంగా తయారుచేసుకున్న కథతో తానే డైరెక్టర్ గా తెలుగులో కొత్తగా అర్జున్ రెడ్డిని తెరకెక్కించాడు.
సరైన హీరో కోసం వెతుకుతూ హీరో శర్వానంద్ దగ్గరకు వెళ్లి కథ చెప్పాడు. కథ విన్నాక తెగ మెచ్చేసుకున్న శర్వానంద్,దర్శకత్వ భాద్యతలు,నిర్మాణ భాద్యతలు సందీప్ రెడ్డి స్వయంగా చేస్తానని చెప్పాడు. అయితే శర్వానంద్ నిర్మాత, దర్శకుడు ఒక్కరే అయితే ఆ ప్రభావం రిజల్ట్ పై పడే అవకాశం ఉందని భావించి వేరే నిర్మాతల దగ్గరకు పంపించాడు.
వారు కథ విన్నాక రిస్కీ ప్రాజెక్ట్ అని భావించి ఆ సినిమాను నిర్మించడానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండను సంప్రదించడం విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా ప్లస్ అయింది. ఈ సినిమాతో విజయ్ రేంజ్ ఎక్కడకో వెళ్లిపోయింది.