ఈ కాయలు కనబడితే అస్సలు వదలద్దు… బంగారం కంటే విలువైనవి
Budama kayalu benefits in telugu : మనకు తెలియని ఎన్నో మొక్కలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మన చుట్టుపక్కల ఉండే ఎన్నో రకాల మొక్కల గురించి మనకు పెద్దగా తెలీదు. వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బుడమ కాయ గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఇది తీపి పులుపు కలిసి విచిత్రమైన రుచితో ఉంటాయి. ఈ కాయలు పైన సన్నటి పొర లాంటి కవచం ఉండి లోపల చిన్ని పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా పండినప్పుడు టమాటా రంగులో ఉంటాయి. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఉన్నవారు ఈ పండ్లు తినిపిస్తే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది. అలాగే మలబద్దకం సమస్యకు కూడా సహాయపడుతుంది.
ఈ పండ్లను దసరా రోజు అమ్మవారి దగ్గర పెట్టి కొంతమంది తింటుంటారు. పొలాల్లో పని చేసే వారికి గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కాయలను తెచ్చి వాటినుండి వచ్చే పసరును గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది.
ఈ కాయలలోనే కాకుండా ఆకులలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెట్టు ఆకులు కూడా చాలా బాగా సహాయపడుతాయి ఈ ఆకులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు రావు. కీళ్ల నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి మెత్తగా నూరి నొప్పులున్న చోట కట్టడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ కాయలలో పైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో అధిక బరువు తగ్గటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.