Healthhealth tips in teluguKitchen

పరగడుపున తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే.. ముఖ్యంగా ఈ సీజన్ లో…

Usiri and Honey Benefits In telugu: ఈ సీజన్ లో ఉసిరికాయలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. ఉసిరికాయ,తేనే కలిపి తీసుకుంటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరి కాయల్లో, తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
Usirikaya benefits
ఈ రెండింటిలోను యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఎన్నో గుణాలు సమృద్దిగా ఉన్నాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తేనెలో నానబెట్టిన ఉసిరికాయను ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల ఇది లివర్‌ను హెల్తీగా ఉంచడంతో పాటు జాండిస్‌ను నివారిస్తుంది.
usiri and honey
శరీరంలో మరియు కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్ మరియు టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దాంతో కాలేయం మరింత చురుకుగా పనిచేస్తుంది. తేనెలో నంబెట్టిన ఉసిరికాయ అజీర్తి మరియు ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు. అంతే కాదు ఇది ఆకలిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని త్రాగడం వల్ల మలబద్దకం నుండి మరియు పైల్స్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ముఖ్యంగా చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనపడుతుంది.

ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెను పోసి దానిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. ఆ తర్వాత మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.