Healthhealth tips in teluguKitchen

ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలద్దు… ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది

Kamanchi Plant Health Benefits In telugu :మన చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు కనిపించినా.. వాటి గురించి తెలియక పిచ్చి మొక్కలుగా భావిస్తాం.ఆ మొక్కలలో ఊహించని ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉంటాయి. గ్రామాల్లో ఎన్నో రకాల మొక్కలు కనబడుతుంటాయి. గ్రామాల్లోని వారు వాటి ఔషధ గుణాలు ఉపయోగించుకుంటూ ఉంటారు.

ఈ రోజు కామాక్షి మొక్క గురించి తీసుకుందాం. ఈ మొక్క చిన్నగా ఉండి దట్టంగా పెరుగుతుంది.కామంచి మొక్క ఒక జాతికి చెందింది. కామాక్షి చెట్టు అని కూడా పిలుస్తారు దీనికి చిన్న చిన్న పండ్లు కాస్తాయి. ఇవి గుత్తులు గుత్తులుగా కాసి, ఎర్రగా ఉండి చిన్న టమాటా పండులా ఉంటాయి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
liver
ఈ మొక్క ఆకులతో లివర్ ని శుభ్రం చేసుకోవచ్చు. లివర్ కి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఈ ఆకులను శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. ఈ రసం 20 ml లేదా 30 ml మోతాదులో తీసుకుని దానిలో కొంచెం జిలకర్ర పొడి లేదా మిరియాలపొడి కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే అన్ని రకాల లివర్ వ్యాధులు తగ్గిపోతాయి.

లివర్ లో వ్యర్థాలు అన్ని బయటకు వెళ్ళిపోయి, లివర్ శుభ్రంగా మారడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. లివర్ ఇన్ఫెక్షన్, కామెర్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.లివర్ సమస్యలకి ఒక అద్భుతమైన ఔషధంగా చెప్పొచ్చు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గిపోతాయి.
Mouth Ulcer in telugu
ఈ మొక్క పండ్లను 20 లేదా 30 సేకరించి తింటూ ఉంటే నోటి పూత తగ్గుతుంది ఈ ఆకును కూరగా చేసుకుని తింటే రేచీకటి తగ్గుతుంది. ఈ మొక్క ఆకుల రసం యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది. ఇటీవలే కొంద‌రు భార‌తీయ సైంటిస్టులు ఈ మొక్కకు చెందిన ఆకుల్లో క్యాన్సర్ల‌ను త‌గ్గించే ఔషధ‌గుణాలు ఉన్నాయ‌ని తేల్చారు.
eye sight remedies
అందుకు సంబంధించి వారు పేటెంట్ హ‌క్కుల‌ను కూడా తీసుకున్నారు. కలుపుమొక్క అని భావిస్తున్న ఈ కామంచి మొక్కలో ఔషధ గుణాలు సమృద్దిగా ఉండుట వలన ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకుండా ఇంటికి తెచ్చుకుని వేసుకోండి. ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.