Healthhealth tips in teluguKitchen

డ్రై ఫ్రూట్స్ (Dry fruits) తినటానికి ముందు ఎన్ని గంటలు నానబెట్టాలో తెలుసా ?

Dry fruits soaked in water benefits: Soaked Nuts : మారిన పరిస్థితి మరియు జీవనశైలి కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్స్ ని ప్రతి ఒక్కరూ తినటం అలవాటుగా చేసుకున్నారు.
walnut benefits in telugu
నట్స్ అనేవి మనకు పోషకాలను అందించటంతో పాటు రోజంతా హుషారుగా ఉండేలా చేస్తాయి. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటూ ఉంటారు. మనకు ఎన్నో రకాల Nuts అందుబాటులో ఉన్నాయి. అయితే మనలో చాలా మందికి నట్స్ ని ఎన్ని గంటలు నానబెట్టి తినాలో.. అనే సందేహం ఉంటుంది.
Diabetes patients eat almonds In Telugu
నట్స్ ని చల్లని నీటిలో కన్నా వేడి నీటిలో నానబెడితే వాటి మీద ఉన్న పొట్టు సులభంగా వస్తుంది. అలాగే ఆ నీటిలో కాస్త ఉప్పు వేస్తే అందులో ఉండే ఎంజైమ్ లు తటస్ధీకరించబడతాయి. దుమ్ము, దూళీ వంటి హాని కరమైన అవశేషాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని నట్స్ ని ఎక్కువ సమయం నానబెట్టాలి.
gummadi ginjalu benefits in telugu
మరి కొన్నింటిని తక్కువ సమయం నానబెడితే సరిపోతుంది. ఆయా నట్స్ స్వభావాన్ని, గట్టితనాన్ని బట్టి నానబెట్టే సమయం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటేనే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ ను 8 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. అలాగే బాదంను 12 గంటలు, గుమ్మడి గింజలు 7 గంటలు నానబెట్టాలి.
cashew nuts benefits in telugu
ఇక జీడిపప్పు 6 గంటలు, అవిసె గింజలు 6 గంటలు, బ్రోకలీ గింజలు 8 గంటలు, శనగలు 8 గంటలు, వేరుశనగ గింజలు 7 గంటలు వరకు నానబెట్టాలి. వాల్ నట్స్ లో ఫైటిక్ రసాయనాలు ఉంటాయి. వీటిని నానబెడితే ఫైటిక్ రసాయనాలు తొలగిపోతాయి. ఫైటిక్ రసాయనాలు ఉన్న నట్స్ జీర్ణం కావటం కష్టతరంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.