Rajamouli ని రిజెక్ట్ చేసిన స్టార్స్ ఉన్నారంటే నమ్ముతారా …చూడండి
Rajamouli Movies :Tollywood దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇండియన్ టాప్ డైరెక్టర్ల లిస్టులో టాప్ లో ఉంటాడు. ఎందుకంటే తను తీసిన సినిమాలన్ని సూపర్ హిట్. ఏ సినిమా కూడా యావరేజ్ గా ఆడలేదు.అందుకే తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు.వెనుకా ముందూ ఆలోచించంచకుండా వెంటనే ఓకే చెప్తారు.
అయితే రాజమౌళి కావాలని కొందరి నటులను తమ సినిమాలో నటించాలని అడిగినప్పటికీ కొందరు వివిధ కారణాల వలన వదులుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ , ఎస్ ఎస్ రాజమౌళి కాంబో అంటే స్టూడెంట్ నెంబర్,సింహాద్రి,యమదొంగ సూపర్ డూపర్ హిట్. అయితే సింహాద్రి మూవీని మొదట్లో ప్రభాస్ తో చేయాలని జక్కన్న భావిస్తే, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అంతగా నచ్చకపోవడంతో సింహాద్రిని ప్రభాస్ వదులుకున్నాడట. దాంతో ఆ ఛాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి దక్కింది.
ఇక తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ కి తీసుకెళ్లిన బాహుబలి మూవీలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర సూపర్భ్. ఆమె నటనకు జనం ఫిదా అయ్యారు. అయితే ఈ పాత్రకోసం దివంగత అందాల తార శ్రీదేవిని స్వయంగా రాజమౌళి సంప్రదిస్తే, ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడంతో రమ్యకృష్ణను తీసుకున్నారట.
ఇక ఇదే సినిమాలో భల్లాల దేవుడిగా నెగెటివ్ క్యారెక్టర్ లో వివేక్ ఒబెరాయ్ అయితే సరిగ్గా సరిపోతాడని జక్కన్న అడిగాడు. అయితే అప్పటికే బిజీగా ఉండడంతో నో చెప్పేశాడట. అలా ఆ పాత్ర రానాకు దక్కి ఎక్కడలేని ఇమేజ్ తెచ్చింది. అంతేకాదు, అవంతిక పాత్రకు సోనమ్ కపూర్ ని జక్కన్న అనుకున్నాడట. స్వయంగా సంప్రదిస్తే, ఏవో కారణాలతో వదిలేసుకుంది. దాంతో ఈ ఛాన్స్ తమన్నా కొట్టేసి, మంచి క్రేజ్ తెచ్చుకుంది.