MoviesTollywood news in telugu

Andala Ramudu సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరు?

Suneel Andala Ramudu Full Telugu Movie :సునీల్ నటించిన అందాల రాముడు సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి కమెడియన్స్ కి మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో రేలంగికి హీరోల కన్నా మంచి డిమాండ్ ఉండేదని అనేవారు. తర్వాత కాలంలో కూడా కమెడియన్స్ మంచి గుర్తింపుతో పాటు కొందరు కమెడియన్స్ హీరోలుగా రాణించిన సందర్భాలున్నాయి.

అప్పట్లో రాజబాబు,ఆ తర్వాత బ్రహ్మానందం కూడా హీరోలుగా వేశారు. అలాగే యమలీలతో అలీ హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత కమెడియన్ గానే కొనసాగుతున్నాడు. ఇక సునీల్ కూడా హీరోగా ఓ వెలుగు వెలిగి మళ్ళీ కమెడియన్ వేషాలు వేస్తున్నాడు. సునీల్ హీరోగా నటించిన మర్యాదరామన్న హిట్ కావడంతో వరుస సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి.

అయితే కొన్ని అనుకోకుండా దక్కాయి. అందులో అందాలరాముడు మూవీ ఒకటి. ఇది కమెడియన్ సునీల్ నటించిన మొదటి సినిమా. అయితే ఈ సినిమాలో బ్రహ్మాజీని హీరోగా తీసుకోవాలని భావించారట. అయితే సిందూరం రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉండడంతో ఈ సినిమాకు సునీల్ ని ఒకే చేశారట.:

స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన అందాల రాముడు మూవీలో సునీల్ మంచి ఎమోషన్స్ పండించాడు. దీంతో ఈ సినిమాకు అడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అప్పట్లోనే 18 కోట్లు వసూలు చేసి, ఆశ్చర్య పరిచింది. అయితే రానురాను హీరోగా క్లిక్ కాకపోవడంతో సునీల్ మళ్ళీ కమెడియన్ గా కొనసాగుతున్నాడు.