Chiranjeevi,విజయ శాంతి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు హిట్…?
Chiranjeevi And Vijayashanti Movies :టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. చిరంజీవి, విజయశాంతి జోడీగా కలిసి 19 సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో అప్పట్లో చిరంజీవి, విజయశాంతి జోడీ కి మంచి క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి తెలుసుకుందాం.
మొదటి సినిమా సంఘర్షణ సూపర్ డూపర్ హిట్ అయింది. రెండో సినిమా దేవాంతకుడు యావరేజ్ గా నిలిచింది. మూడో సినిమా మహానగరంలో మాయగాడు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. నాలుగో సినిమా చాలెంజ్ సూపర్ డూపర్ హిట్ అయింది.
5 వ సినిమా చిరంజీవి డిజాస్టర్ అయింది. ఆరవ సినిమా కొండవీటి రాజా సూపర్ డూపర్ హిట్ అయింది. ఏడో ఒక సినిమా ధైర్యవంతుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
8 వ సినిమా చాణక్య శపథం డిజాస్టర్ అయ్యింది. 9వ సినిమా పసివాడి ప్రాణం సూపర్ డూపర్ హిట్ అయింది.
పదవ సినిమా స్వయంకృషి హిట్ అవడమే కాకుండా నంది అవార్డు తీసుకొచ్చింది. పదకొండవ సినిమా మంచి దొంగ అ యావరేజ్ గా నిలిచింది. పన్నెండవ సినిమా యముడికి మొగుడు సూపర్ డూపర్ హిట్ అయింది.
13వ సినిమా యుద్ద భూమి డిజాస్టర్ అయ్యింది. 14వ సినిమా అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సూపర్ డూపర్ హిట్ అయింది. 15వ సినిమా రుద్రనేత్ర డిజాస్టర్ అయ్యింది. 16వ సినిమా కొండవీటి దొంగ యావరేజ్ గా నిలిచింది.
17వ సినిమా స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమా డిజాస్టర్ అయ్యింది. 18 వ సినిమా గ్యాంగ్ లీడర్ సూపర్ డూపర్ హిట్ అయింది. 19వ సినిమా మెకానిక్ అల్లుడు డిజాస్టర్ అయ్యింది.