Getup Srinu మొదటి సంపాదన ఎంతో తెలుసా?
Getup srinu First remuneration :గెటప్ శ్రీను జబర్దస్త్ తో మంచి పేరును సంపాదించాడు. తెలుగు బుల్లితెరపై మొదలు పెట్టిన నాటి నుంచి ఏళ్ళు గడుస్తున్నా జనంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో నడుస్తున్న కామెడీ షోగా జబర్దస్త్ పేరు గాంచింది. ఈ షోలో నటించిన ఎందరో ఆర్ధికంగా నిలబడడమే కాదు, సినిమాల్లో ఛాన్స్ లు కూడా దక్కించుకుని బాగా స్థిరపడ్డారు.
అలాగే సరైనోడు మూవీలో బన్నీతో కల్సి నటించే ఛాన్స్ రావడం, అది హిట్ కావడం తెల్సిందే. అందులో గెటప్ శ్రీనుకి మంచి పాత్ర లభించింది. నిజానికి గెటప్ శ్రీనుకి మొదటి రెమ్యునరేషన్ 40 రూపాయలట. ఎన్నో కష్టనష్టాలు పడుతూ మొత్తానికి జబర్దస్త్ లో చేరి పాపులర్ అయ్యాడు. మొదట్లో సుడిగాలి సుధీర్ టీమ్ లో స్కిట్ల ద్వారా గెటప్ శ్రీను తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకున్నారు .
గెటప్ శ్రీను వల్లే సుధీర్ టీమ్ చేసే స్కిట్లు హిట్ అవుతున్నాయని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ కూడా పెట్టారు. అయితే కమెడియన్ గా సక్సెస్ కావడానికి ముందు ఎన్నో కష్టాలు పడ్డ గెటప్ శ్రీను ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తున్నాడు.సినిమాలలో కూడా ఛాన్స్ లు దక్కించు కుంటున్నాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు.