Krishna ఘరానా దొంగ సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Krishna Gharana Donga Full Movie : కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. బాలనటిగా చాలా సినిమాల్లో చేసిన శ్రీదేవి అప్పట్లో కృష్ణతో 5 సినిమాలు చేసింది. అయితే హీరోయిన్ గా బుర్రిపాలెం బుల్లోడు మూవీతో కృష్ణతో జోడీ కట్టింది. అక్కడ నుంచి 31 సినిమాలు కృష్ణ కాంబినేషన్ లో చేసింది. కృష్ణ సరసన విజయ నిర్మల, జయప్రద తర్వాత ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ శ్రేదేవి.
హిందీ ఫీల్డ్ లో కృష్ణ తీసిన హిమ్మత్ వాలా మూవీతో హీరోయిన్ గా శ్రీదేవి ఎదిగింది. అందుకే కృష్ణ సినిమాలు అంటే డేట్స్ ఇచ్చి నటించేది. 1980లో కృష్ణ, శ్రీదేవి కాంబోలో వచ్చిన నాలుగు సినిమాల్లో మొదటిది ఘరానా దొంగ. దీనికి కె రాఘవేంద్రరావు డైరెక్టర్. కృష్ణ,రాఘవేంద్రరావు కాంబోలో ఇది రెండో సినిమా. టి త్రివిక్రమరావు భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా తర్వాత కృష్ణ ,శ్రీదేవి కాంబోలో ఖైదీ రుద్రయ్య తీశారు.
ఇక సత్యానంద్, జంధ్యాల కల్సి రచించిన తొలిసినిమా ఘరానాదొంగ. కృష్ణ చలాకీతనం, శ్రీదేవి గ్లామర్, సత్యానంద్ మాటలు, వేటూరి సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. విలన్ గా రావు గోపాలరావు, ఆయన కొడుకుగా మోహన్ బాబు నటించారు. భారీ ఓపెనింగ్స్ తెచ్చిన ఈ మూవీ ఘనవిజయాన్ని అందుకుంది.