Telugu బుల్లితెరపై రాణిస్తున్న వెండితెర నటుల వారసులు ఎంత మంది ఉన్నారో…?
Tollywood Actors In small Screen : ఈ మధ్య కాలంలో Tv సీరియల్స్ చూసే వారి సంఖ్య చాలా బాగా పెరిగింది. వెండితెర మీద పలువురు నటీనటులు తమ నటనతో అలరించి, ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకోగా, అందులో కొందరి వారసులు బుల్లితెర మీద నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే అమ్మ సీరియల్ లో నటిస్తున్న సాత్విక్ కృష్ణ ఎవరో కాదు, తెలుగు చిత్ర సీమలో తన కంచు కంఠంతో ఏలిన కొంగర జగ్గయ్య మనవడే.
కోయిలమ్మ, అగ్నిసాక్షి, ఆడదే ఆధారం, స్వాతిచినుకులు వంటి సీరియల్స్ లో సాత్విక్ నటించాడు. స్టార్ మాలో ఇటీవల ముగిసిన మౌనరాగం సీరియల్ లో నటించిన సాక్షి శివ స్వయంగా సాక్షి రంగారావు కి చిన్న కుమారుడు. ఆడదే ఆధారం, నెంబర్ వన్ కోడలు, అక్కమొగుడు వంటి సీరియల్స్ లో శివ నటించాడు.
పలు సినిమాల్లో అలాగే పలు సీరియల్స్ లో నటించిన జి ఎస్ హరి ప్రస్తుతం జి తెలుగులో వచ్చే సూర్యకాంతం సీరియల్ లో నటిస్తున్నాడు. సీతా మహాలక్ష్మి, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వంటి సీరియల్స్ లో నటించాడు. ఈయన స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి కజిన్. ఇక పలు సినిమాల్లో నటించి పలు సీరియల్స్ లో నటిస్తున్న దేవిశ్రీ ఎవరో కాదు మురళీమోహన్ కి స్వయానా మేనకోడలు. ఇద్దరమ్మాయిలు, గోరింటాకు వంటి సీరియల్స్ లో ఆమె నటించారు.
నువ్వే కావాలి మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సాయికిరణ్ ఆతర్వాత పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు.కోయిలమ్మ, గుప్పెడంత మనసు వంటి సీరియల్స్ తో పాపులర్ అయ్యారు. ప్రముఖ గాయనీ గాయకులూ జ్యోతి,రామకృష్ణ దంపతుల కుమారుడు.తులసిదళం అనే తెలుగు సీరియల్ తో తెలుగు బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన శ్రావ్యశృతి పెద్దయ్యాక గోకులం అపార్ట్ మెంట్స్, పెళ్ళినాటి ప్రమాణాలు వంటి సీరియల్స్ లో చేసి, ప్రస్తుతం మనసుమమత సీరియల్ లో నటిస్తోంది. ఈమె ప్రముఖ నటుడు, సింగర్ నల్లూరి సుధాకర్ చిన్న కుమార్తె.