Tollywood లేడి విలన్స్ గా సత్తా చాటిన సూపర్ హీరోయిన్స్ ఎంత మంది…?
Tollywood heroines Turn villains : సినీ పరిశ్రమలో ఎన్నో వింతలు ఉంటాయి. ఒకప్పుడు హీరోయిన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అదరగొట్టిన నారీమణులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇండస్ట్రీలో లేడీ విలన్స్ కి గల ప్రాముఖ్యత దృష్ట్యా ఇప్పుడు విలన్స్ గా కూడా తమ సత్తా చాటుతున్నారు. కొందరైతే ఒక రంగంలో హీరోయిన్ గా రాణిస్తూ,మరో రంగంలో విలన్ అవతారం దాల్చి తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు.
తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా పరిచయం గల తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తమిళంలో హీరోయిన్ గా నిరూపించుకుని తెలుగులో నెగెటివ్ క్యారెక్టర్స్ వేస్తోంది. మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో వరలక్ష్మి ఆడియన్స్ ని మెప్పించింది.
ఇక ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరుగా నిల్చిన హీరోయిన్ రమ్యకృష్ణ నరసింహ సినిమా లో నీలాంబరి గా నెగెటివ్ రోల్ వేసి,రజనీకాంత్ తో పోటీపడి నటించింది. ఆ పాత్రలో నటించి లేడి విలన్ గా మంచి పేరు తెచ్చుకుంది.
ఇక తెలుగు అందాల హీరోయిన్ రాశి ఎన్నో మంచి పాత్రలో మెప్పించి, నిజం సినిమాలో విలన్ పాత్రలో బాగా నటించింది. ఇక తెలంగాణ శకుంతల ఎన్నో కామెడీ పాత్రలు వేయడమే కాకుండా నువ్వు నేను లాంటి సినిమాల్లో విలన్ పాత్రలో కూడా మెప్పించింది.
జబర్దస్త్ షో తో బుల్లితెర యాంకర్ అనసూయ ఎంతటి పాపులార్టీ తెచ్చుకుందో చూసాం. ఇక రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రలో వొదిగి పోయింది. పుష్ప సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించింది. కాగా టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా కూడా ఎవరు సినిమాలో నెగిటివ్ పాత్రలో బాగా మెప్పించింది.