చిటికెడు పొడి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును 10 రోజుల్లో కరిగించి బరువు తగ్గిస్తుంది
Weight Loss Powder In telugu : అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువ సేపు అలా కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో శరీరంలో కొవ్వు పెరిగి అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి డాక్టర్స్ చుట్టూ తిరిగి ట్రీట్ మెంట్స్ అంటూ వేల కొద్దీ డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇంటి చిట్కాలతో అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.
ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనిలో 4 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. ఈ పొడిని తయారుచేసుకోవడం కూడా సులభమే. ఒక్క సారి చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాకపోతే ప్రతి రోజు ఓపికగా తీసుకుంటూ ఉండాలి.
అప్పుడే మంచి ఫలితం కనపడుతుంది. పాన్ లో ఒక కప్పు అవిసె గింజలు, అరకప్పు జీలకర్ర, పావుకప్పు సొంపు, ఒక కప్పు కరివేపాకు వేసి వెగించాలి. బాగా వేగాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడిని కలిపి తాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే అధిక బరువు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకోవాలి. ఒక్కసారిగా తగ్గిపోకూడదు. కాబట్టి ఈ పొడిని ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.