వారంలో 3 సార్లు బలహీనంగా ఉన్న ఎముకలు బలంగా మారి నొప్పులు తగ్గుతాయి
Joint Pains Home Remedies In telugu :ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లు వచ్చాక వచ్చే సమస్యలన్నీ 30 సంవత్సరాలు దాటేసరికి వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మనం ఇంటిలోనే ఒక షేక్ తయారు చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఎముకలు బలహీనంగా మారడం వల్ల నొప్పులు విపరీతంగా ఉంటాయి. అంతేకాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. ఎముకల బలహీనతను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు చెప్పే షేక్ చాలా బాగా సహాయపడుతుంది.
రాత్రి సమయంలో ఒక కప్పులో రెండు స్పూన్ల తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు వేసి నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఒక యాపిల్ తీసుకుని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నానబెట్టిన నువ్వులు నీటితో సహా వేసి మిక్సీ చేయాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల బెల్లం, ఒక స్పూన్ సోంపు గింజలు, ఒక గ్లాసు ఆవు పాలు వేసి మెత్తగా చేసుకుంటే నువ్వుల ఆపిల్ షేక్ సిద్దం అవుతుంది. ఈ షేక్ చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఎముకల బలహీనతను దూరం చేస్తుంది. ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి.
ఎముకలకు అవసరమైన పోషకాలు అన్ని ఈ షేక్ లో లభ్యమవుతాయి. ఎముకల బలహీనతతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా కనీసం వారంలో మూడు సార్లు అయినా ఈ షేక్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ షేక్ ఉదయం సమయంలో తాగితే అలసట, నీరసం,నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.