Little Soldiers సినిమాలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా… ఏం చేస్తుందో తెలుసా.?
Little Soldiers Child Artist Kavya :చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినవాళ్లు పెద్దయ్యాక స్టార్స్ గా స్థిరపడుతుంటారు. కొందరు ఫీల్డ్ కి దూరం అవుతారు. మరికొందరు వేరే రంగాల్లో స్థిరపడి రీ ఎంట్రీ ఇస్తుంటారు. ఇక 20ఏళ్ళు వెనక్కి వెళ్తే , లిటిల్ సోల్జియర్స్ సినిమా లో వేసిన ఇద్దరు పిల్లల్లో ఒకరు బేబీ కావ్య,మరొకరు బాలాదిత్య. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.
అంతలా యాక్ట్ చేసారు. ఇందులో సన్నీ పేరుతొ చైల్డ్ ఆర్టిస్టుగా బాలాదిత్య నటించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి , పెద్దయ్యాక హీరోగా వేసి,తర్వాత ఛాన్స్ లు రాకపోయినా మాథ్స్ లో జీనియస్ కావడంతో సి ఏ విద్యార్థులకు పాఠాలు చెప్పుతూ… సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. బాలాదిత్య ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్నాడు.
బేబీ కావ్య అప్పట్లో సెన్షేషన్ సృష్టించింది. బన్నీ పాత్ర పోషించిన బేబీ కావ్య అచ్చం చాలా ఇళ్లల్లో అమ్మాయిలు చిన్నప్పుడు ఎలా అల్లరి చేస్తారో అలానే చేసి చూపించి ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈమె పెద్దయ్యి,పెళ్లి కూడా చేసేసుకుంది. లిటిల్ సోల్జియర్స్ తర్వాత ఈమె ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ సినిమా దర్శకుడు గుణ్ణం రంగరాజు సోదరి కూతురే కావ్య. మూవీ హిట్ అయ్యాక ఆమె మళ్ళీ సినిమాలు చేయలేదు. చేయాల్సిన అవసరం కూడా ఆమెకు లేదు. డబ్బున్న ఇంట్లో పుట్టిన ఈమె ఇప్పుడు డాక్టర్ కూడా.
హైదరాబాద్ లో సన్ షైన్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ గురువారెడ్డికి ఒక్కగానొక్క గారాల పట్టీ కావ్య. ఇక తల్లి ప్రఖ్యాత గైనకాలజిస్ట్. అదే హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక ఇదే సినిమాలో కావ్య సోదరుడు ఆదర్శ్ కూడా లిటిలో సోల్జియర్స్ లో టీంకు పాత్ర పోషించాడు. అయితే సన్ షైన్ హాస్పిటల్ లోనే ఆర్ధోపెడిక్ గా పనిచేస్తున్నాడు. వరల్డ్ ట్రావెల్ పార్క్ సంస్థ సిఇఓ హర్షరెడ్డితో హైదరాబాద్ లో పెళ్లయింది. ఆదర్శ్ పెళ్ళికి చిరంజీవి,బాలకృష్ణ వంటి ప్రముఖులు వచ్చారు.
గురువారెడ్డి వారసులుగా కావ్య,ఆదర్శ్ చక్కని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఆదర్శ్ ఫ్రెండ్ ఖుషాల్ ని కావ్య లవ్ చేసి పెళ్లిచేసుకుంది. నాలుగేళ్లపాటు సాగిన ప్రేమాయణంలో ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. కేరళలో సన్నిహితుల నడుమ వైభవంగా పెళ్లి జరిగింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబ సమేతంగా వీరి పెళ్ళికి విచ్చేసారు. ఖుషాల్ మణిపాల్ లో మెడిసిన్ చేసి ,హైదరాబాద్ లోనే సన్ షైన్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాడు.