ఈ డ్రింక్ తాగితే అధిక బరువు,చెడు కొలెస్ట్రాల్, అలసట,నీరసం అనేవి ఉండవు
chia seeds health benefits In telugu : మారిన జీవనశైలి మరియు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వంటి అనేక రకాల కారణాలతో ఎదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
అధిక బరువు సమస్య తగ్గుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే నీరసం,అలసట ఉండవు. నొప్పులు లేకుండా రోజంతా హుషారుగా పనులు చేసుకోవచ్చు. కీళ్ళనొప్పులతో బాధపడేవారు ఈ డ్రింక్ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ డ్రింక్ ని తయారుచేసుకోవటం చాలా సులువు.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ చియా విత్తనాలు వేసి అరగంట అలా వదిలేస్తే గింజలు ఉబ్బి జెల్లీ మాదిరిగా తయారవుతాయి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె ,అరచెక్క నిమ్మరసం, 6 లేదా 7 పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పావుగంట అలా వదిలేయలి. ఆ తర్వాత అవసరమైతే ఐస్ క్యూబ్ వేసుకొని తాగాలి.
చియా విత్తనాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, క్యాల్షియం, మాంగనీస్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, పాస్పరస్, విటమిన్ బి1, బి2, బి3 ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటి వల్ల బరువు తగ్గుతారు. అలాగే అలసట,నీరసం తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. నొప్పులను తగ్గిస్తుంది.
పుదీనా చెడు కొలెస్ట్రాల్ లేకుండా అధిక బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ నీరసం,అలసటను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ డ్రింక్ రోజు తాగవచ్చు…లేదా రోజు విడిచి రోజు తాగవచ్చు. ఈ సీజన్ లో తాగితే సీజనల్ సమస్యలు ఏమి ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.