ఉల్లి Vs వెల్లుల్లి… ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు
Onion And Garlic Health Benefits in telugu :ఉల్లి, వెల్లుల్లి రెండింటిని మనం ప్రతి రోజు వాడుతూ ఉంటాం. ఉల్లి మరియు వెల్లుల్లి రెండు కూడా అల్లియం కుటుంబానికి చెందినవి. ఉల్లి, వెల్లుల్లిలో ఉండే అనేక సమ్మేళనాలు మన ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జరిపిన పరిశోధనలలో తేలింది. ఉల్లి, వెల్లుల్లి రెండింటిలోనూ సల్పర్ సమ్మేళనాలు ఉండుట వలన ఘాటైన వాసనను కలిగి ఉంటాయి.
ఉల్లి, వెల్లుల్లి రెండింటిలోనూ అంటువ్యాధులను ఎదుర్కొనే శక్తి ఉంది. అయితే ఉల్లి హానికరమైన బ్యాక్టీరియాతో పోరాటం చేసి జలుబు యొక్క లక్షణాలను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ లేకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఉల్లి, వెల్లుల్లి రెండు కూడా క్యాన్సర్ ని నిరోదించటంలో సహాయపడతాయి.
వీటిలో ఉన్న రసాయనాలు ఊపిరితిత్తులు,పెద్దప్రేగు,food pipe మరియు రొమ్ము క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. క్యాన్సర్ కణితులను పెరగకుండా చేస్తాయి. ముఖ్యంగా ఉల్లిపాయతో పోలిస్తే వెల్లుల్లి గ్యాస్ట్రిక్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్కు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఉల్లిపాయతో సహజసిద్ధమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన గుండె జబ్బుల ప్రమాదం నుండి కాపాడుతుంది. అంతేకాక రక్తం గడ్డకట్టే ప్రమాదం నుండి కూడా కాపాడుతుంది.వెల్లుల్లిని ఉపయోగించటం వలన ఆస్టియో ఫ్లోరోసిస్, మధుమేహం,హై కొలస్ట్రాల్, హై బిపి, ప్రొస్టెస్ట్ క్యాన్సర్, రింగ్ వర్మ, చర్మ సమస్యలు మొదలైన వాటి నివారణలో సహాయాపడుతుంది.
ఉల్లిపాయను ఉపయోగించటం వలన జుట్టు సమస్యలు, హై బిపి, మధమెహం, ఒబెసిటీ, స్ట్రెచ్ మార్క్స్, ఆస్త్మా, కడుపు అప్సెట్, దగ్గు, జలుబు,జ్వరం, గొంతు ఇన్ ఫెక్షన్స్, పుండ్లు తగ్గిస్తుంది. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవటం వలన నోటిలో దుర్వాసన, నోటిలో లేదా కడుపులో మంట, గుండెల్లో మంట,గ్యాస్,వికారం,వాంతులు మరియు విరేచనాలు కలుగుతాయి.
అలాగే రక్తస్రావ ప్రమాదం మరియు అలెర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనలలో ఉబ్బసం కూడా వస్తుందని తెలిసింది.
ఉల్లిపాయను ఉపయోగించినప్పుడు పెద్దగా సైడ్ ఎఫక్ట్స్ఉండవు . ఒకవేళ ఉన్న పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. అయితే రోజులో ఉల్లిపాయ,వెల్లుల్లి ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకుందాం. ఉల్లిపాయ వాడకం అనేది వయస్సు, ఆరోగ్యం మరియు అనేక ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తగిన మోతాదులోనే అంటే రోజుకి ఒక ఉల్లిపాయలను తీసుకుంటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.