ఈ ఒక్క పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఈ సీజన్ లో అస్సలు మిస్ కావొద్దు.. ఎందుకంటే..
Orange Health benefits In telugu : ఏ సీజన్ లో లభించే పండ్లను ఆ సీజన్ లో తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అంది ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రూటేసి కుటుంబానికి సిట్రస్ జాతికి చెందిన కమలాపండు పులుపు,తీపి కలయికతో ఉంటుంది. ప్రస్తుతం కమలా పండ్లు విరివిగా లభిస్తున్నాయి. ధర కూడా అందరికి అందుబాటులో ఉంటుంది. కమలా పండ్లలో సిట్రస్, లిమినోయిడ్స్ ,మాంసకృత్తులు, పిండి పదార్థాలు, పీచుతోపాటు ఖనిజ లవణాలైన క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం,బీటా కెరోటిన్ పుష్కళంగా లభిస్తాయి.
ఇందులోని ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి . కాస్త అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి ఉన్నప్పుడు కమలా జ్యుస్ త్రాగితే వెంటనే నూతన ఉత్తేజం, శక్తి లభించి నీరసం వంటివి తగ్గుతాయి. కమలా రసంలో ఉండే హెస్పెరిడిన్, డయోలిస్టిక్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతాయి. కాబట్టి గుండె సమస్యలు కూడా దరి చేరవు.
బరువు తగ్గాలని అనుకొనే వారికీ కమలా పండు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. కమలా రసంలో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కొంత మందికి మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది. అలాంటి వారు కమలా రసంలో లేత కొబ్బరి నీరు కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కమలా పండులో ఫోలిక్ ఆమ్లం ఉండుట వలన మెదడు పనితీరు బాగుండటమే కాకుండా వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోవటం వంటివి తగ్గుతాయి. ఒక గ్లాసు కమలా రసంలో చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ తేనె కలిపి తాగితే, నీరసం తొలగిపోయి నూతన శక్తి, ఉత్తేజాన్ని పుంజుకుంటారు. చాలా త్వరగా శక్తిని ఇస్తుంది.
ఈ పండులో బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ప్రతి రోజు కమలా రసం తీసుకోవటం వలన మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది. ఈ పండులో విటమిన ఎ ఉండుట వలన కంటి చూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చేస్తుంది. అంతేకాక కాలేయం పనితీరును క్రమబద్దీకరణ చేస్తుంది. కమలా పండులో ఉండే పీచు శరీరంలో ఉండే హానికరమైన కొలస్ట్రాల్ ను కరిగిస్తుంది.
దీనిలో ఉండే విటమిన్ సి శరీరంలోని వ్యర్ధాలను బయటకు పోవటానికి దోహదం చేస్తుంది.అంతేకాక దీర్ఘ కాలిక వ్యాధులను అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ పండులో వైరల్ ఇన్ ఫెక్షన్ ను నియంత్రించే పోషకాలు ఉంటాయి. పాడైన కణాలను పునరుద్దరణ చేయటానికి కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి.కాల్షియం దంతాలు, ఎముకలను పటిష్టంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కమలా పండును తిన్నట్లయితే ఆ సమస్యలనుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది.కమలా పండులో లభించే క్యాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది.కమలా తొనలు తినటం మంచిదా లేదా కమలా జ్యుస్ త్రాగటం మంచిదా అనేది మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది.
కమలా జ్యుస్ కన్నా కమలా తొనలు తినటమే మంచిది. ఎందుకంటే కమలా తొనలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఆ ఫైబర్ జీర్ణ ప్రక్రియలో బాగా సహాయపడుతుంది. కాబట్టి తొనల రూపంలో తింటేనే మంచిది. కమలాలు సిట్రస్ జాతికి చెందిన పండ్లు. వీటిలో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. భోజనం తరువాత కానీ, అల్పాహారం తిన్న గంట తరువాత తింటే మంచిది. వీటిలోని ఆమ్లాలు ఖాళీకడుపులోని అల్సర్స్ ను పెంచుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.