Indra Movie చైల్డ్ ఆర్టిస్టు తేజ హీరోగా మారటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో…?
Indra Movie Child Artist Teja :చైల్డ్ ఆర్టిస్టు తేజ హీరోగా మారటానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ మూవీ. ఇందులో చిన్నప్పటి చిరుగా అలరించిన చైల్డ్ ఆర్టిస్టు తొడ కొట్టి, కూర్చునే సీను థియేటర్లలో చప్పట్లు కొట్టించింది. ఇంతకీ ఇప్పుడు అతడు హీరో అయ్యాడు.
అతడి పేరు తేజ సజ్జా. నిజానికి రెండున్నరేళ్ల వయసులో ఓసారి అతడి కజిన్ రెస్టారెంట్ కి తీసుకెళ్తే, అప్ప టికే ‘చూడాలని ఉంది’ కోసం దర్శకుడు గుణశేఖర్ ఓ అబ్బాయికోసం వేట మొదలు పెట్టాడట. సరిగా అదే హోటల్లో తేజను గుణశేఖర్ చూసి వెంటనే సెలక్ట్ చేసుకున్నారట. అలా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన తేజకు ఆతర్వాత బి గోపాల్ తీసిన ‘ఇంద్ర’ మంచి పేరు తెచ్చిపెట్టింది.
దాంతో వరుసగా చైల్డ్ ఆర్టిస్టుగా ఛాన్స్ లొచ్చాయి. చైల్డ్ ఆర్టిస్టుగా 50 సినిమాలకుపైగా నటించాడు. ఇక తేజ పెద్దయ్యాక చాలా కష్టపడి హీరో కోసం చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చి, ‘జాంబీ రెడ్డి’మూవీతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరో ఛాన్స్ కోసం తేజ ఐదేళ్లు ఆగాల్సి వచ్చిందట. కొన్ని సినిమాల్లో సెలెక్ట్ అయ్యి అంతా ఓకే అనుకున్న సమయంలో ప్రాజెక్టు ఆగిపోయిన సందర్భాలున్నాయి.
మరి కొందరేమో ‘సారీ తేజా’ అని సింపుల్ గా చెప్పేసి ఇంకొకరిని సెలక్ట్ చేసుకునేవారట. చాలా ఛాన్స్ లు పోగొట్టుకున్నాక ఎలాగైతేనేం అయిదేళ్లు విశ్వప్రయత్నాలు చేయడంతో ఇప్పటికి ‘జాంబీ రెడ్డి’తో హీరో అయ్యాడట. ఇప్పుడు అద్భుతం వంటి సినిమాలతో హిట్ అందుకొని ముందుకు సాగుతున్నాడు.