ఈ సీజన్ లో మాత్రమే లభించే ఈ పండ్లను అసలు మిస్ చేసుకోవద్దు… ఎందుకంటే…
Regi Pandu benefits In Telugu :ఈ పండులో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. పులుపు, తీపి రుచుల కలయికతో ఉండే రేగు పండ్లు చలికాలంలో విరివిగా లభిస్తాయి. ఈ రేగి పండ్లలో దాదాపుగా 40 రకాలు ఉన్నాయి. కొన్ని జాతుల పండ్లు చిన్నవిగా ఉంటే కొన్ని జాతుల పండ్లు పెద్దవిగా ఉంటాయి. సంక్రాంతి సమయంలో భోగి రోజున ఈ పండ్లను ‘భోగి పండ్ల’ పేరిట భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ చిన్నారులపై పోస్తారు.
చలికాలంలో లభించే రేగి పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రేగి పండ్లతో పచ్చిమిర్చి,బెల్లం ఉప్పు వేసి వడియాలు పెడతారు. ఈ వడియాలను ఎండబెడితే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. సీజనల్ ఫ్రూట్ అయినా రేగి పండ్లను సంవత్సరం మొత్తం తినాలంటే వడియాలు పెట్టుకోవచ్చు.
రేగిపండ్లలో విటమిన్ సి,ఏ, పొటాషియం,కార్బో హైడ్రేడ్స్,పీచు పదార్ధం,ప్రోటీన్స్,దయామిన్,రైబో ఫ్లోవిన్,నియాసిన్,కాల్షియం,ఐరన్ ,పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. రేగి పండ్లను తొక్కతో సహా తింటేనే పోషకాలు మన శరీరానికి అందుతాయి. కొంతమంది తొక్కను పాడేస్తూ ఉంటారు. జామకాయ తర్వాత విటమిన్ సి ఎక్కువగా ఈ రేగిపండ్లలోనే ఉంటుంది.
ఈ చలికాలంలో తరచుగా దగ్గు,జలుబు వస్తూ ఉంటాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే రెగ్యులర్ గా రేగి పండ్లను తింటూ ఉండాలి. చేతి నిండుగా రేగు పండ్లను తీసుకుని ఒక అరలీటరు నీటిలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. ఆ ద్రవానికి చక్కెర లేదా తేనె కలిపి దాన్ని ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు తాగితే చక్కని ఆరోగ్యం చేకూరుతుంది.
ఈ మిశ్రమంలో ఉండే గ్లుంటామిక్ యాసిడ్ మెదడు బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.ఒత్తిడి తగ్గించే గుణాలు రేగి పండ్లలో ఎక్కువగా ఉండుట వలన ఒత్తిడిగా ఉన్నప్పుడు నాలుగు రేగి పండ్లు తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలను ఇవి కలిగి ఉన్నాయి.
రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు సైతం ఈ పండ్లు తింటే మంచిది వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు కీళ్ల మంటల్ని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. మన ఎముకలు దృఢంగా, గట్టిగా ఉండేందుకు అవి ఉపయోగపడతాయి.
కొంతమందికి ఎంత ట్రై చేసినా నిద్రపట్టదు. చివరకు నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సరైన పండ్రు రేగు పండ్లు. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెండ్స్, ఫైటోకెమికల్స్, పోలీశాచరైడ్స్, ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్ వంటివి ఉన్నాయి. ఇవి నిద్ర బాగా వచ్చేలా చేస్తాయి. నరాలను శాంతపరచడం ద్వారా ఇవి మనం నిద్రపోయేలా చేయగలవు.
టెన్షన్, ఒత్తిడి వంటివి తగ్గాలంటే కూడా రేగుపండ్లు తినాలి.చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. మల్లబద్దకం ఉన్నవారికి రేగిపండు మరీ మంచిది. రోజూ తింటే ఆ సమస్య చాలా తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రేగు పండు మంచిది. ఇవి ఎన్ని తిన్నా లావెక్కరు.
ఎందుకంటే ఇందులో ఉండే కెలోరీలు చాలా తక్కువ. కొవ్వు ఉండదు. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.రుచితో పాటు మంచి ఆరోగ్యాన్నిచ్చే ఈ రేగి పండ్లు ధరలోనూ ఎంతో చవకగా లభిస్తాయి. సహజంగా లభించే పండ్లు కూడా భారీ ధరలు పలుకుతున్న ఈ రోజుల్లో రేగి పండ్లు అందరికీ అందుబాటులో ఉండే ఫలాలు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.