ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఈ జ్యూస్ తీసుకుంటే…ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారు…
Beetroot Juice Health benefits In telugu : ఉదయం లేవగానే మనలో చాలా మంది కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. అలా తాగకపోతే రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు చెప్పే జ్యూస్ తాగితే చాలా మంచిది. మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలన్న., వచ్చిన సమస్యలు తగ్గాలన్న మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
అయితే ఉదయం కాఫీ టీ లకు బదులుగా ఇప్పుడు చెప్పే జ్యూస్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న బీట్ రూట్ ని తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక దానిమ్మకాయ తీసుకుని తొక్క తీసి గింజలను ఒక బౌల్ లో వేసుకోవాలి. మిక్సీ జార్ లో దానిమ్మ గింజలు, టమాటా ముక్కలు, బీట్రూట్ ముక్కలు, ఐదు ఎండు ద్రాక్షలు, మూడు గింజ తీసిన ఖర్జూరాలు, ఒక గ్లాసు నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ సపరేట్ చేసుకుని ఉదయం సమయంలో తాగాలి. .
ప్రతిరోజు తాగుతూ ఉంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలు ఏమీ లేకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగిపోతాయి. .
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగి బరువు తగ్గుతారు. కాబట్టి కాస్త ఓపికగా ఈ జ్యూస్ చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ మధ్యకాలంలో రక్తహీనత సమస్య అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. అసలు అశ్రద్ధ చేయకూడదు. ఈ జ్యూస్ ఉదయం సమయంలో తీసుకోవడం వలన అలసట, నీరసం లేకుండా రోజంతా చురుకుగా ఉంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.