డయాబెటిస్ ఉన్నవారు వేరుశెనగలు తినవచ్చా… తింటే ఏమి అవుతుంది
peanuts good for diabetes :ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నిర్వహణలో ఆహారం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు వేరుశనగలను తింటే ఏమి అవుతుందో చూద్దాం.
ప్రోటీన్ సమృద్ధిగా ఉండే వేరుశనగలను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేరుశనగలను తగిన మోతాదులో తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరిగి రక్త పోటు స్థాయిలు నియంత్రణలో ఉండి గుండెకు మేలును చేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు వేరుశనగలను తినటం అనేది మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు
వీటిలో ఎన్నో పోషకాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వేరుశనగలలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఇన్సులిన్ ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్సులిన్ రక్తంలో మరియు శరీర కణాలలోకి ప్రవేశించడానికి సహాయ పడుతుంది ఆ కారణంగా శక్తిగా మారుతుంది. డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
వేరుశెనగలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకుంటే ఆహారం నెమ్మదిగా మరియు స్థిరంగా చక్కెరగా మారతాయి. దాంతో రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా ఉంటుంది. వేరుశనగలలో అసంతృప్త కొవ్వు మరియు ఇతర పోషకాలు సమృద్దిగా ఉండటం వలన ఇన్సులిన్‌ను నియంత్రించడంలో శరీరం యొక్క సామర్థ్యానికి సహాయపడతాయి.
అయితే రోజులో ఎన్ని వేరుశనగలను తినవచ్చు అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. నిపుణుల ప్రకారం రోజుకి 42 గ్రాములు అంటే దాదాపు 16 పల్లీలు తింటే చాలట. కొందరు రోజులో గుప్పెడు తినడం మంచివని చెబుతున్నారు. ఏది ఏమైనా మితంగా తింటే మంచిదే. మీ శరీర తత్వాన్ని బట్టి రోజులో ఎంత తినాలో మీ న్యూట్రిషనిస్టుని కనుక్కుని తినడం ఇంకా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.