Jagapati Babu ఒక్క రోజుకి ఎన్నిలక్షలు తీసుకుంటాడో తెలుసా?
Tollywood hero jagapathi babu remuneration : జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ పరిశ్రమలో కుటుంబ కథాచిత్రాల్లో నటించి ఎంతో మంది మహిళా అభిమానులను సంపాదించుకున్న జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలు, హీరో.. హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తూ సక్సెస్ గా బిజీగా గడిపేస్తున్నాడు.
జగపతి బాబు నటించిన విలన్ తండ్రి పాత్రలకు పూర్తి న్యాయం చేయడంతో పాటు ఆ సినిమాలు హిట్ కావడంతో అవకాశాలు వరుస పెట్టి వస్తున్నాయి. ప్రస్తుతం జగపతి బాబు పారితోషికం గురించి చర్చ జరుగుతోంది.
స్టార్ హీరోల స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నాడట. పారితోషికం గురించి జగపతి బాబు మాట్లాడుతూ సెకండ్ ఇన్నింగ్స్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని తనకు ఫిక్స్ డ్ రెమ్యునరేషన్ లేదని సబ్జెక్ట్, సినిమా బడ్జెట్ ను బట్టి తన పారితోషికం కూడా మారుతుందని జగపతిబాబు అన్నారు