1 గ్లాస్ తాగితే చాలు జీవితంలో డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరమే ఉండదు…సర్వ రోగ నివారిణి
Tulsi Water Benefits In telugu : తులసిని దేవుని పూజ కోసం ప్రతి రోజు వాడుతూ ఉంటాం. కాబట్టి దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది. తులసిఆకులలో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతి రోజు తులసి ఆకులు లేదా తులసి నీటిని తాగితే ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రతిరోజు తులసి ఆకులను నీటిలో మరిగించి లేదా రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో నాలుగు లేదా ఐదు ఆకులను వేసి మరుసటి రోజు ఉదయం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తులసి శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.
ఈ చలి కాలంలో జలుబు, దగ్గు, గొంతుకి సంబంధించిన సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర వంటివి కూడా ఉండవు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు ప్రతిరోజు మూడు తులసి ఆకులను తినాలి. లేదా తులసి నీటిని తప్పనిసరిగా తాగాలి.
డయాబెటిస్ ఉన్న వారికి కూడా చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో విషపదార్థాలు బయటకు పంపటంలో సహాయపడుతుంది. తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే తులసి నీటిని తాగాలి.
అలాగే తులసి నీటిని తయారు చేసుకోవటం కూడా సులభమే. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. శరీరంలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు) సమతుల్యం చేయడంలో తులసి సహాయపడుతుంది. ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యలను తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి తులసి నీటిని తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.