Anasuya యాంకర్ కాక ముందు ఏమి చేసేదో తెలుసా? తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?
Anchor anasuya details : బుల్లితెరలో అనసూయ తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. బుల్లితెర రంగంలో ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చాక యాంకర్స్ కి గిరాకీ పెరిగింది. మొదట్లో సుమ,ఝాన్సీ,ఉదయభాను వంటి వాళ్ళు ఉంటె ఇప్పుడు చాలామంది వచ్చినా ఇందులో పాపులర్ గా వినిపించే పేరు అనసూయ అని చెప్పాలి.
ఆమె షో చూసేవాళ్ళు కోట్లలో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. హైదరాబాద్ లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుదర్శనరావు,అనురాధ దంపతులకు జన్మించి అక్కడే పెరిగిన ఈమె నార్త్ ఇండియన్ ని లవ్ చేసి పెళ్లాడడానికి పెద్ద యుద్ధం కూడా చేసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టినా అందం ఏమాత్రం తరగలేదు.
జబర్దస్త్ ప్రోగ్రాం లో ఎవరెన్ని పంచ్ డైలాగులు వేసినా చాలా లైట్ గా, స్పోర్టివ్ గా తీసుకుంటూ అనసూయ పాపులర్ అయింది. జబర్ దస్త్ ప్రోగ్రాం కి కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా తిరిగి ఎంట్రీ ఇవ్వడం ద్వారా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం సినిమాలతో కూడా చాలా బిజీగా ఉంది.
హెచ్ ఆర్ గా మొదలై, యాంకర్ గా వచ్చిన అనసూయ సినిమాల్లో కూడా తన నటనతో మెప్పిస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా మూవీలో నాగార్జున మరదలుగా, రంగస్థలంలో రంగమ్మత్తగా,యాత్రలో చరిత గా మంచి పాత్రలతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఒక్కో సినిమాకు 40నుంచి 50లక్షలు తీసుకుంటున్న ఈమె , జబర్ దస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్ కి లక్ష వరకూ తీసుకుంటోంది.
చేసేది చిన్నపాత్ర అయినా గుర్తింపు ఉండాలని చెబుతోంది. నిజానికి అనసూయ తండ్రి సుదర్శనరావు నల్గొండ జిల్లా పోచంపల్లి భూస్వామ్య కుటుంబానికి చెందిన వ్యక్తి. సుదర్శనరావు ముగ్గురు అన్నదమ్ములు,ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లి అనురాధ వాళ్ళది కర్ణాటక రాయచూర్ ప్రాంతం. కానీ ఘాట్ కేసరి లో ఉండేవాళ్ళట. 1985ఏప్రియల్ 15న అనసూయ జన్మించింది.
ఈమెకు అంబిక,వైష్ణవి అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. అనసూయ కు నానమ్మ పేరు పెట్టారు. వైష్ణవి అప్పడప్పుడు అనసూయతో కనిపిస్తుంది. ఓ ప్రయివేట్ మీడియా లిమిటెడ్ కంపెనీ నడుపుతోంది. అనసూయ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆమెను ఆర్మీలోకి పంపాలని తండ్రి సుదర్శనరావు అనుకునేవాడట. అందుకే ఎన్సీసీ లో చేర్చారు. రెండు సార్లు పెరేడ్ కమాండర్ గా వెళ్ళింది. కానీ ఈమె ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండేదట. డిగ్రీ పూర్తయ్యాక హెచ్ ఆర్ గా చేస్తూ న్యూస్ రీడర్ జాబ్స్ ఉన్నాయని తెల్సి సాక్షిలో చేరి, వ్యాఖ్యాతగా చేసింది.
న్యూస్ రీడర్ గా ఓ టాక్ షో చేసినపుడు రామ్ గోపాల్ వర్మతో దిల్ సే టాక్ షో తో మంచి పేరువచ్చింది. బ్యూటీగా ఉంటావని మోడలింగ్ ట్రై చేయమని చెప్పడంతో ఈటీవీ,మాటివి లలో ఫ్రీలాన్సర్ గా చేసింది. ఇంటర్ లో ఎన్సీసీలో చేస్తున్న సమయంలో బీహార్ కి చెందిన సుశాంత్ భరద్వాజ్ తో ఏర్పడిన పరిచయం లవ్ కి దారితీసింది. ఎందుకంటే భరద్వాజ్ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఇక 2009లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే లవ్ విషయం చెప్పేసింది. మొదట్లో తండ్రి ఒప్పుకోకపోయినా ఆతర్వాత అంగీకరించి పెళ్లి చేసాడు.
భరద్వాజ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా ఉన్నారు. వీరికి సౌర్య భరద్వాజ్,ఆయాశ్ భరద్వాజ్ అనే ఇద్దరు పిల్లలు. 2013లో ఈటివి లో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో జబర్ దస్త్ స్టార్ట్ అవ్వడంతో అనసూయ కెరీర్ టాప్ రేంజ్ కి చేరింది. బిగువైన డ్రెస్ లు, మోడరన్ డ్రెస్ లు వేసుకోవడంపై విమర్సలు వస్తే మోడర్న్ గా ఉంటె తప్పేంటని కొట్టిపారేసింది.
ఇలాగే ఉంటానని కుండబద్దలు కొట్టి చెప్పేసింది. కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వడంతో రేష్మి వచ్చింది. మళ్ళీ అనసూయ రీ ఎంట్రీ ఇచ్చి వరల్డ్ వైడ్ గా పేరుతెచ్చుకుంది. జి తెలుగులో బిందాస్, ,స్టార్ మాలో మోడరన్ మహాలక్ష్మి,ఈటీవీలో తడాఖా, టివి 9లో డేట్ విత్ అనసూయ షోలలో చేసింది. గంగోత్రి మూవీలో అల్లు అర్జున్ గురించి చేసిన పాత్రపై అనసూయ చేసిన కామెంట్ పెద్ద దుమారం రేపింది.
అయితే దాన్ని కవర్ చేసుకుంటూ బన్నీ అంటే ఇష్టమని , నటనలో బాగా పరిణతి చెందాడని చెప్పినా ఈమె మీద ట్రోల్స్ తగ్గలేదు. ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఈస్థాయికి వచ్చానని చెప్పే అనసూయ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా రెండు చేతులా సంపాదిస్తోంది.