Sindhooram సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Krishna Vamsi Sindhooram Full Movie : టాలీవుడ్ లో సినిమాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్క అభిమానికి ఆసక్తి ఉంటుంది. ఎక్కువ రిస్క్, తక్కువ ఆదరణ ఊహించి డేరింగ్ గా తీసే సినిమాలు చాలా తక్కువ. అయితే 1997లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సామాజిక అంశాలను ఎత్తుకుంటూ రిస్క్ తో తీసిన సినిమా సిందూరం. నక్సలైట్లు, పోలీసు వ్యవస్థల నడుమ లోతైన చర్చ జరిపిన సినిమా ఇది.
సిన్సియర్ పోలీసాఫీసర్ వ్యాస్ తన బాధ్యతల నిర్వహణలో హత్యకు గురవ్వడం అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న కృష్ణవంశీ మదిలో చెరగని ముద్ర వేసింది. నక్సలైట్ వ్యవస్థ సరైన ఆలోచలనాలతో వెళ్తోందా, పోలీసు వ్యవస్థ గాడి తప్పిందా ఇలా ఎన్నో ఆలోచనలు చేసాడు. గులాబీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, నిన్నే పెళ్లాడతా మూవీతో క్రియేటివ్ డైరెక్టర్ గా ఎదిగిన కృష్ణవంశీ వెంట చాలామంది బడా నిర్మాతలు పడ్డారు.
అయితే నక్సలిజం మీద తీయాలని, అప్పటికే వచ్చిన విప్లవం మూవీస్ అన్నీ చూసి, వాటి ఛాయలు పడకుండా భిన్నంగా కథ రాసారు. వర్షం మూవీ డైరెక్టర్ శోభన్ ఈ కథలో పని చేయడమే కాకుండా కో డైరెక్టర్ గా చేసాడు. సిరివెన్నెల సీతారామస్త్రి అద్భుతమైన సలహాలు ఇవ్వడంతో పాటు, అద్భుతమైన 5సాంగ్స్ కూడా రాసారు. శోభన్ ,శక్తి, చైతన్య ప్రసాద్ డైలాగ్స్ రాశారు. హాయ్ రే హాయ్ సాంగ్ ని చంద్రబోస్ రాసారు.
కృష్ణవంశీ తానే నిర్మాతగా మారి, ఆంధ్రా టాకీస్ పేరిట తొలిసినిమాగా సింధూరం ప్రకటించాడు. 1988లో ఒకపూట అన్నం పెట్టాడన్న కృతజ్ఞతతో గులాబీ మూవీలో మంచి పాత్రను బ్రహ్మజీకి ఇచ్చాడు. సింధూరం లో హీరో క్యారెక్టర్ ఇచ్చేసాడు. నిన్నే పెళ్లాడతా మూవీకి అసిస్టెంట్ గా చేసిన రవితేజను సెకండ్ హీరోగా సెలక్ట్. సౌందర్య, మీనా లలో ఒకరిని హీరోయిన్ గా చేయాలనుకున్నా, చివరికి సంఘవిని సెలెక్ట్ చేసారు.
భానుచందర్, శివాజీ రాజా, ఆహుతి ప్రసాద్ తదితర తారాగణం. మ్యూజిక్ డైరెక్టర్ గా శ్రీ. 1997ఏప్రియల్ లో షూటింగ్ స్టార్ట్. తూర్పు గోదావరిలో షూటింగ్ దాదాపు పూర్తి. ముఖ్యంగా రంపచోడవరం అడవుల్లో తీశారు. 1997సెప్టెంబర్ 12న రిలీజైన ఈ మూవీ మొదట్లో ఇందిరా, రాజీవ్ హత్యలను చూపించారు. ఎమోషన్స్ తో కూడిన సీన్స్, పాటలు, అప్పటి సామాజిక పరిస్థితులు, అవినీతి, సిన్సియారిటీ ఇలా అన్ని కలగలిపి తీసిన ఈ మూవీ కాసుల వర్షం మాత్రం కురిపించలేదు.
బ్రహ్మాజీ కెరీర్ లో సింధూరం బెస్ట్ మూవీ . అర్ధశతాబ్ధపు సాంగ్ రాసిన సిరివెన్నెల కు అందరూ ప్రశంసలు కురిపించారు. కృష్ణ వంశీని ఆర్ధికంగా చిక్కుల్లో పడేసిన ఈ మూవీ అంతః పురం, ఖడ్గం లాంటి మూవీస్ తీయడానికి ఊతమిచ్చింది. ఎందుకంటే ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు రావడమే. అలాగే ఐదు నంది అవార్డులు తెచ్చింది.