MoviesTollywood news in telugu

Vikram సినిమా గురించి ఈ నిజాలు మీకు తెలుసా…వెంటనే చూసేయండి

Nagarjuna vikram movie Details :ఇప్పటికీ టాలీవుడ్ మన్మథుడిగా రాణిస్తున్న కింగ్ నాగార్జున అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇస్తూ తీసిన విక్రమ్ సినిమాను అప్పట్లో వి మధుసూదనరావు డైరెక్ట్ చేసారు.శోభన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ, విభిన్న పాత్రలు పోషిస్తూ ఎందరినో మెప్పించిన నాగ్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీకి రెండుకళ్ళుగా భావించే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లలో అక్కినేనికి ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురమ్మా యిలు అన్నపూర్ణ స్టూడియో చూసుకుంటూ అబ్బాయిలిద్దరూ నిర్మాతలుగా ప్రయాణం మొదలు పెడతారని అందరూ భావించారు. అయితే కృష్ణ నటించిన పెద్దలు మారాలి మూవీలో 8ఏళ్ళ వయస్సులో నటించిన నాగార్జునకు నటనంటే ఇష్టం. అయితే ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది.

సుడిగుండాలు మూవీలో చిన్న పాత్ర వేసిన నాగ్ అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసుకుని వచ్చారు. అప్పుడు నటనపై ఆసక్తి గురించి అన్నయ్య వెంకట్ ద్వారా అక్కినేని దృష్టికి తేవడం,ఆయన ఆనందించడం, తల్లి ఆశీర్వాదం ఉండడం వంటి నేపథ్యంలో ముంబయిలో నటనలో శిక్షణ, హైదరాబాద్ లో చాట్ల శ్రీరాములు దగ్గర డైలాగ్ మాడ్యులేషన్, సలీం దగ్గర డాన్స్ లో శిక్షణ ఇప్పించారు.

1985 ఆగస్టు 21న అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ లో ప్రకటన చేసేసారు. హిందీ సాహెబ్ రీమేక్ కోసం చూస్తే దానిని గీతా ఆర్ట్స్ కొనేసింది. హీరో హిందీ రీమేక్ హక్కులు తీసుకుని విక్రమ్ పేరుతొ తెలుగులో చేసారు. అక్కినేని 62వ పుట్టినరోజు సెప్టెంబర్ 20నాడు విక్రమ్ షూటింగ్ స్టార్ట్. కె రాఘవేంద్రరావు క్లాప్ కొత్తగా, దాసరి నారాయణరావు కెమెరా స్విచ్ఛాన్ చేసారు.

శివాజీ గణేశన్, ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ వచ్చి అభినందనలు తెలిపారు. వి మధుసూదనరావు నెలకొల్పిన మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్థులు కూడా ఈ సినిమాలో నటించారు. కర్ణాటక బెంగుళూరుకి 300కిలోమీటర్ల దూరంలోని కుద్రేముఖ్ దగ్గర ఈ సినిమా షూటింగ్ చేసారు. హెలికాఫ్టర్ సన్నివేశంలో చిన్న ప్రమాదం తప్పింది. అప్పుడు కెమెరా మెన్ తో పాటు, డైరెక్టర్ కూడా అందులో ఉన్నారు. ఇక సరస్సు దగ్గర శోభన కొట్టుకుపోతుంటే సిబ్బంది కాపాడారు. ఫైట్ సీన్ లో నాగ్ కి బలంగా దెబ్బతగి లింది.

ముంబైలో కాలికి చిన్న ఆపరేషన్ తో సినిమా వాయిదా. 1986మే 23న 38సెంటర్స్ లో 67థియేటర్లలో రిలీజ్. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విక్రమ్ 99వ రోజున నాగ్ పుట్టినరోజే రావడంతో 100రోజుల వేడుక గ్రాండ్ గా చేయాలనుకున్నా, ప్రకృతి విలయతాండవంతో ఫంక్షన్ విరమించుకున్నారు. తుపాన్ బాధితులకు రెండున్నర లక్షల విరాళం అందించారు.