Chiranjeevi కి బాగా సూటైన TOP 10 హీరోయిన్ లు ఎవరో…?
chiranjeevi career best heroines : చిరంజీవి waltair veerayya సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్నారు. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి డాన్స్, ఫైట్స్ కి కొత్త ట్రెండ్ తెచ్చారు. స్టెప్స్ వేయాలంటే ఆయన తర్వాతే. ఇప్పుడొస్తున్న స్టార్ హీరోలకు ఆయన స్ఫూర్తి. అయితే చిరంజీవి కెరీర్ లో ఆయనతో సమానంగా స్టెప్స్ వేస్తూ, నటన కనబరుస్తూ సరిజోడీగా నిల్చిన స్టార్ హీరోయిన్స్ విషయంలోకి వెళ్తే, అందులో మొదటగా రాధికను ప్రస్తావించాలి.
తొలిరోజుల్లో న్యాయం కావాలి,జ్వాలా,పట్నం వచ్చిన పతివ్రతలు,దొంగమొగుడు వంటి ఎన్నో హిట్స్ లో ఈ జంట కల్సి నటించారు. అభిలాష మూవీ ఈ జంటకు మంచి పేరు తెచ్చింది.ఇక రాధ విషయానికి వస్తే కొండవీటి, దొంగ,యముడికి మొగుడు,దొంగ,రాక్షసుడు,అడవిదొంగ వంటి చిత్రాల్లో డాన్సులలో చిరంజీవికి సరైన జోడీగా నిల్చింది.
ఇక ఆతర్వాత ప్రస్తావిస్తే, లేడీ అమితాబ్ విజయశాంతి. ఈమెకు చిరంజీవికి సరిగ్గా సూటయ్యింది. చూడచక్కని జంటగా వెండితెరపై వెలిగారు.అత్తకు యముడు అమ్మాయికి మొగుడు,పసివాడి ప్రాణం,యముడికిమొగుడు,గ్యాంగ్ లీడర్ ఇలా పలు ఇండస్ట్రీ హిట్స్ లో చిరంజీవితో సమానంగా విజయశాంతి డాన్స్ లు చేసి ఔరా అన్పించింది. దాదాపు 19సినిమాలలో వీరిద్దరు కల్సి నటించారు.
అలాగే చిరంజీవితో సమానంగా యాక్టింగ్ లో అదరగొట్టిన నటి సుహాసిని. మగమహారాజు,ఛాలెంజ్,విజేత,ఆరాధన,మంచిదొంగ,రాక్షసుడు,కిరాతకుడు ఇలా పది సినిమాల్లో చిరుతో జోడీ కట్టి, మెప్పించింది.భానుప్రియ విషయానికి వస్తే ఖైదీ నెంబర్ 786,చక్రవర్తి,దొంగమొగుడు వంటి సినిమాలతో చిరు పక్కన నటించిన అందం,అభినయంతో అలరించింది.
శుభలేఖ,ఖైదీ చట్టంతో పోరాటం,వేట వంటి దాదాపు అరడజను సినిమాల్లో చిరుకి మంచి జోడీగా సుమలత నిల్చింది. అల్లుడా మజాకా,ఇద్దరు మిత్రులు వంటి సినిమాల్లో చిరుతో కల్సి రమ్యకృష్ణ జోడీ కట్టి మెప్పించింది. ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ లో నటించిన సోనాలి బింద్రే నటనకు ఫాన్స్ ఫిదా అయ్యారు. అందుకే శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఆట కావాలా పాట కావాలా అంటూ చిరుతో ఆడిపాడిన సిమ్రాన్ మొదటగా అన్నయ్య మూవీలో చేసి తర్వాత దాడి,మృగరాజు మూవీస్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక రాజకీయాల్లోకి వెళ్ళాక మళ్ళీ ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సరసన నటించి కాజల్ అగర్వాల్ మెప్పించింది. దాంతో ఆచార్య మూవీలో కూడా నటించే ఛాన్స్ అందుకుంది.