ఎన్నో ఔషద గుణాలున్న ఈ ప్రత్యేక పండును అసలు మిస్ చేసుకోవద్దు…ఎందుకంటే
Sapota Fruit Health benefits In telugu: ఏ సీజన్ లో వచ్చే పండ్లను ఆ సీజన్ లో తప్పనిసరిగా తినాలి. సపోటేసి కుటుంబానికి చెందిన సపోటా అనేది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరిగే ఒక సతత హరితమైన చెట్టు. సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు గింజలు ఉంటాయి. పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది.
కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది.సపోటాను చిక్కూ అని కూడా పిలుస్తారు. సపోటా పండు గురించి అందరికి తెలుసు. కానీ సపోటాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సపోటా పండులో గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి.
దీని రుచి తియ్యగా ఉండడం వల్ల షేక్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. సపోటాలో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలలో సహాయపడుతుంది. వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సపోటాలో గ్లూకోజ్ సమృద్దిగా ఉండుట వలన తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే క్రిడాకారులు ఎక్కువగా సపోటాలను తింటూ ఉంటారు.
సపోటా యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందువల్ల చికాకుపెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధులను నివారించి జీర్ణ వాహిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఎటువంటి వాపునైనా, నొప్పినైనా తగ్గించడం ద్వారా మంటను కూడా తగ్గిస్తుంది. సపోటాలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వలన ఎముకల ద్రుడత్వానికి,విస్తరణకు సహాయపడుతుంది.
సపోటాలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల సపోటా పండులో 5.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేసి మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది. సపోటాలో పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నీరసాన్ని,గర్భధారణ సమయంలో వచ్చే వికారం, మైకం వంటి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.