MoviesTollywood news in telugu

Chanti సినిమాకి పోటీ ఇచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

Victory Venkatesh Chanti Movie : venkatesh తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేసాడు. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన చంటి మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. తమిళ చిన్నతంబి మూవీకి రీమేక్ గా వచ్చిన చంటి మూవీని రవిరాజా పినిశెట్టి తెరకెక్కించారు. 1992 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజయింది. సుజాత, నాజర్, మంజుల తదితరులు నటించిన ఈ మూవీలో అమాయక క్యారెక్టర్ లో వెంకటేష్ అదరగొట్టాడు.

ఇళయరాజా అద్భుత మ్యూజిక్ ఇచ్చాడు. బెస్ట్ సింగర్ గా బాలు, బెస్ట్ యాక్టర్ గా నాజర్, బెస్ట్ గీత రచయితగా వేటూరి లకు అవార్డులు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 4థియేటర్లలో రిలీజై, తొలిసారి రికార్డు నెలకొల్పింది. చంటి 33 సెంటర్స్ లో డైరెక్ట్ గా, షిఫ్ట్ లతో 40పైగా సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 9కోట్ల షేర్ రాబట్టింది.

సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. చంటి రిలీజ్ అయిన రోజే నాగార్జున నటించిన కిల్లర్ మూవీ రిలీజయింది. ఎమోషన్, లవ్ స్టోరీలో వచ్చిన ఈ మూవీలో నాగార్జున, నగ్మా, శారద కీలక పాత్రల్లో చేసారు. నటీ నటులు తమ నటనతో అదరగొట్టగా, ఇళయరాజా తన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు.

ప్రియా ప్రియా తమ రాగాలు అనే సాంగ్ సూపర్ హిట్. మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ మూవీ ఏవరేజ్ అయింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన రక్తతర్పణం మూవీ నిరాశ పరిచింది. కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో వర్ష హీరోయిన్ గా చేసింది. కాగా రాజేంద్రప్రసాద్ నటించిన అప్పుల అప్పారావు జనవరి 24న రిలీజయింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని దక్కించుకుంది. చంటి బిగ్గెస్ట్ హిట్ తో నెంబర్ వన్ కాగా, అప్పుల అప్పారావు సెకండ్ ప్లేస్ లో వచ్చింది.