ఆకుపచ్చ బాదంపప్పు ఎప్పుడైనా తిన్నారా… ఊహించని ప్రయోజనాలు ఎన్నో…?
Green Almonds Health benefits In telugu: ఆకుపచ్చ బాదంపప్పులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. రోజూ కొన్ని బాదంపప్పులను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం తోటలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఆకుపచ్చ బాదంను ఎక్కువగా తింటూ ఉంటారు.
ఆకుపచ్చ బాదంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అనేక రకాల వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఆకుపచ్చని బాదంలో ఎల్-కార్నిటైన్ మరియు రిబోఫ్లావిన్ అనేవి సమృద్దిగా ఉండుట వలన మెదడుకు మరియు నరాలకు అవసరమైన పోషణను అందిస్తుంది.
దాంతో మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ బాదంలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, ఇవి మన శరీరంలో యాంటీఆక్సిడెంట్ల శక్తిని మెరుగుపరుస్తాయి. ఫ్లేవనాయిడ్లు విటమిన్ Eతో కలిసి పనిచేసి రక్తనాళాల గోడలను పగుళ్లు లేదా నష్టాల నుండి కాపాడుతుంది.
ఆకుపచ్చ బాదంపప్పులో ఫాస్పరస్ సమృద్దిగా ఉండుట వలన దంతాలు మరియు ఎముకలకు మేలు చేస్తుంది. ఫాస్పరస్ దంతాలు మరియు చిగుళ్లను బలంగా చేయడం ద్వారా నోటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలోని pH స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. పైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది.
పరగడుపున ఆకుపచ్చ బాదంపప్పు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ తీసుకునే వారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. బాదం రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రిస్తుంది. ఆకుపచ్చ బాదంపప్పులు ఆమ్ల మరియు పుల్లని రుచిని కలిగి ఉంటాయి. సముద్రపు ఉప్పుతో లేదా పచ్చిగా తింటే అవి రుచిగా ఉంటాయి. వాటిని సూప్‌లు, సలాడ్‌లు మరియు పాస్తాకు కూడా జోడించవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.