చలికాలంలో గుమ్మడికాయ తింటున్నారా… ఊహించని ప్రయోజనాలు ఎన్నో…
Pumpkin Benefits In Telugu : గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుమ్మడి కాయతో కుర, పులుసు వంటి వాటిని ఎక్కువగా చేసుకుంటారు. చలికాలం మొదలు కాగానే ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటివి వచ్చేస్తూ ఉంటాయి.
వీటికి చెక్ పెట్టాలంటే గుమ్మడి చాలా బాగా సహాయపడుతుంది. గుమ్మడికాయలో విటమిన్ సి, ఫైబర్, కెరోటినాయిడ్స్, విటమిన్ డి, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తపోటు, డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. గుమ్మడికాయలో కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గుమ్మడికాయను కొద్ది పరిమాణంలో తీసుకున్నా సరే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
బరువు తగ్గాలని అనుకొనే వారు వారంలో 3 సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య లేకుండా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు.
మలబద్దకం సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో గుమ్మడి కాయ కూర లేదా గుమ్మడికాయను ఏ రూపంలో తీసుకున్నా సరే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో తప్పనిసరిగా గుమ్మడికాయను తినటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.