60 ఏళ్ళు దాటిన సరే టాలీవుడ్ ని ఏలుతున్న హీరోలు…ఎంత మంది ఉన్నారో…?
Tollywood Top Heroes :సాధారణంగా కొత్త నీరు వస్తే,పాత నీరు పోతుందని సామెత. కానీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొత్త వాళ్ళతో ధీటుగా పాత వాళ్ళు కూడా దూసుకుపోతున్నారు. యాజ్ పెరిగినా క్రేజ్ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 65ఏళ్ళు వచ్చినా సరే,ఎనర్జీకి ఏమాత్రం ఢోకా లేదన్నట్లు వరుస హిట్స్ తో సత్తా చాటుతున్నాడు.
పైగా దశాబ్దం పాటు రాజకీయాల్లో కొనసాగి,బాస్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ తో ఖైదీ నెంబర్ 150మూవీ చేసి,స్టెప్పులు,ఫైట్స్ తో అదేజోరు సాగించాడు. తర్వాత సైరా మూవీలో చెలరేగిపోయారు. ఇప్పుడు waltair veerayya సినిమా హిట్ అయ్యింది.
ఇక మొదటి నుంచీ మెగాస్టార్ కి పోటీ ఇస్తున్న నందమూరి బాలకృష్ణ 60ఏళ్ళ ప్రాయంలో కూడా పవర్ ఫుల్ డైలాగ్స్,నటన గల పాత్రలతో హీరోగా అదరగొడుతున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో పలు హిట్స్ అందుకున్న బాలయ్య తాజాగా veera simha reddy సినిమాతో హిట్ కొట్టాడు.
ఇక కింగ్ నాగార్జున ఇప్పటికీ టాలీవుడ్ మన్మథుడిగా రాణిస్తున్నారు. 60ఏళ్ళు పూర్తయి,షష్టిపూర్తి జరిగినా సరే,ఎనర్జిటిక్ గా పక్కా మాస్ మూవీస్ చేస్తున్నాడు. కాగా విక్టరీ వెంకటేష్ అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ ని అలరిస్తూ వీలుంటే మల్టీస్టారర్స్ సైతం చేస్తూ హీరోగా సత్తా చాటుతున్నాడు.