భానుప్రియ చెల్లెలు గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Tollywood Actress shanti priya : సినిమాకి సంబంధించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి ప్రతి అభిమాని సిద్దంగా ఉంటారు. స్వర్ణ కమలం వంటి మూవీస్ తో ఇటు క్లాసికల్ మూవీస్ లోనూ, ఖైదీ నెంబర్ 786వంటి మాస్ మూవీస్ తోనూ ఆకట్టుకున్న భానుప్రియ ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే ఛాన్స్ లు దక్కించుకొంటోంది.
ఛత్రపతి, మహానటి మూవీస్ లో ఈమె నటన బాగా ఆకట్టుకుంది. ఇక భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ కూడా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్. వంశీ డైరెక్షన్ లో మహర్షి సినిమాతో సినిమాల్లోకి వచ్చిన శాంతి ప్రియ 1969సెప్టెంబర్ 22న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జన్మించింది. తమిళ మూవీతో 18వ ఏట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో మహర్షితో ప్రవేశించింది.
యమపాశం, సింహ స్వప్నం, కలియుగ అభిమన్యుడు, శిలాశాసనం, జస్టిస్ రుద్రమదేవి మూవీస్ చేసింది. ఈమె తెలుగు, హిందీ సినిమాల్లో చేసి ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 1995లో సిద్ధార్ రే ను పెళ్లిచేసుకున్నాక ఇండస్ట్రీకి దూరమైంది. అక్షయ కుమార్ నటించిన ఇక్కా పే ఇక్మా మూవీలో నటించిన శాంతిప్రియ ఆతరువాత నుంచి సినిమాల్లో కన్పించలేదు.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శాంతిప్రియ ఫాన్స్ తో టచ్ లో ఉంటోంది. అయితే ఈమె మళ్ళీ సినిమాల్లోకి రాబోతోంది. ఈ విషయం స్వయంగా ఆమె చెప్పింది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఆమెకు ఇద్దరు కుమారులు. 2004లో భర్త చనిపోవడంతో అన్నీ తానై కొడుకులను పెంచుతోంది.